Home /News /astrology /

LENDING AND BORROWING ON TUESDAYS HAVE TO FACE PROBLEMS AND THESE WORKS ARE PROHIBITED RNK

Tuesday: మంగళవారాల్లో అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదా? ఏ పనులను నిషేధించారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tuesday: జ్యోతిష్యంలో మంగళవారాన్ని ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజును అంగారక గ్రహాన్ని సూచిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ గ్రహం ధైర్యం ,శక్తి గ్రహంగా పరిగణిస్తారు. మరోవైపు, మతపరమైన దృక్కోణంలో మంగళవారం బజరంగబలి రోజు. ఈ రోజున భక్తులు హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పూజలు చేస్తారు.

ఇంకా చదవండి ...
మంగళవారం (Tuesday) ఆంజనేయుడికి అంకితం చేసిన రోజు. రాముని భక్తుడైన హనుమంతుడిని (Hanuman) పూజించడం ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా (Hanuman chalisa) పఠించడం వల్ల అన్ని రోగాలు, కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. కలియుగ దేవుడు బజరంగబలి ఇప్పటికీ భూమిపై ఉన్నాడని చెబుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మంగళవారాన్ని అంగారక గ్రహం సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజున చేసే అనేక పరిహారాలు ఉన్నాయి. అంతేకాదు, మంగళవారం కొన్ని పనులు చేయడం నిషేధించారు. వాటిలో ఒకటి ఎవరి దగ్గరా అప్పు ఇవ్వకూడదు, తీసుకోను కూడదు. దీని గురించి పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మంగళవారం రోజు ఎవరికీ డబ్బు ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఈ రోజు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు లేదా ఎన్నో కష్టాలు పడిన తర్వాత తిరిగి వస్తుంది. మరోవైపు మంగళవారం నాడు ఎవరి వద్ద అప్పు తీసుకున్నా.. ఆ డబ్బును తిరిగి ఇవ్వడానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయట. ఇది సంబంధాన్ని పాడు చేస్తుంది.

ఇది కూడా చదవండి: సింధూరంతోపాటు నూనెను లక్ష్మీదేవికి సమర్పిస్తే.. జీవితంలో ఆర్థిక కష్టాలు ఎప్పటికీ రావట..


మంగళవారం రోజు డబ్బుకు సంబంధించిన కొత్త పనులు ప్రారంభించకూడదని పండితులు చెప్పారు. ఇది కాకుండా, ఈ రోజున పదునైన వస్తువులను కొనకూడదు. దీంతో ఇంట్లో కలహాలు ఏర్పడతాయి.

మంగళవారం ఉపవాసం పాటించేవారు ఉప్పు తినకూడదు. మీరు ఆ రోజు లేదా భోజనం సమయంలో పండ్లు తిన్నా, ఉప్పు అస్సలు తినకూడదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం పడమర ,ఉత్తరం వైపు ప్రయాణించడం మానుకోవాలి. ఈ రోజున బెల్లం తినండి. అత్యవసరమైతే మాత్రమే మీ ఇంటి నుండి బయలుదేరండి.

ఇది కూడా చదవండి: ఈ 4 అంశాలు కలలో కనిపిస్తే.. మీ అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుందట..


జ్యోతిషశాస్త్రంలో రోజు మంగళవారం రోజు యాగాలు కూడా చేయడం అశుభమైనదిగా పరిగణిస్తారు. అలాగే ఈ రోజున తెలుపు రంగు లేదా పాలతో చేసిన స్వీట్లను కొనకూడదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఇనుము కొనుగోలు చేయడం అశుభం. ఇలా చేయడం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయి.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు