Home /News /astrology /

KRISHNA JANMASHTAMI 2022 WORLD LARGEST KRISHNA TEMPLE YOU SHOULD KNOW THE SPECIALTY OF THIS TEMPLE SK

Krishna Janmashtami: ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణాలయం ఎక్కడుందో తెలుసా? రూ.800 కోట్లతో నిర్మాణం

మాయాపూర్ కృష్ణాలయం

మాయాపూర్ కృష్ణాలయం

Shri Krishnastami: వచ్చే ఏడాదిలోనే ఈ ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తేవాలని ఇస్కాన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి ఆలయం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి (Shri Krishna Janmashtami) వేడుకలు జరుగుతున్నాయి. మనదేశంలో పాటు ఇతర దేశాల్లోనూ కృష్ణాష్టమిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణ భక్తులు (Lord Shri Krishna) ఒక్క ఇండియాలోనే కాదు.. అన్ని దేశాల్లోనూ ఉన్నారు. వందల కోట్ల మంది కృష్ణ భగవానుడిని ఆరాధిస్తారు. చాలా దేశాల్లో శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్నాయి. ఇక శ్రీకృష్ణుడు జన్మించిన మధురలో వేలకొద్ది మందిరాలు కనిపిస్తాయి. మరి అతిపెద్ద శ్రీకృష్ణుడి ఆలయం ఎక్కడుందో తెలుసా? మధురనో లేదంటే ద్వారకలోనే ఉండొచ్చని చాలా మంది భావిస్తారు. కానీ ఈ రెండూ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద కృష్ణుడి ఆలయాన్ని పశ్చిమ బెంగాల్‌లో నిర్మిస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా మాయాపూర్‌లో 6 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కోల్‌కతా నుండి దాదాపు 130 కి.మీ. ఇది ఉంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్.. అంటే ఇస్కాన్ సంస్థ (ISKCON) ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చుతో ఆలయాన్ని కడుతున్నారు. ఆలయ నిర్మాణం 2009లో ప్రారంభమైంది. 2023 నాటికి ఆలయ 80 శాతం పనులు పూర్తి చేసి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నామని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు.

    జన్మాష్టమిరోజు ఈ 5 తప్పులు చేయకండి.. కృష్ణుడు కోపోద్రిక్తుడవుతాడట..

    ఆలయ ప్రత్యేకతలు:

    ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి ఆలయంలో మొత్తం 7 అంతస్తులు ఉన్నాయి. ఆలయ కీర్తన మందిరం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది.ఇక్కడ ఒకేసారి 10 వేల మంది భక్తులు భజన కీర్తనలు చేయవచ్చు.

    పూజ కోసం పూజారులు సిద్ధం చేసే అంతస్తు ఏకంగా 2.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఆలయం ముందు 45 ఎకరాల్లో రంగు రంగుల పూలతో ఉండే గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

    జన్మాష్టమి రాత్రి ఈ నాణేల పరిహారం మీ ఇంటి ఖజానాను ధనవంతం చేస్తుందట

    మాయాపూర్‌లోని శ్రీకృష్ణాలయ గోపురం ప్రపంచంలోని ఇతర పెద్ద దేవాలయాల గోపురం కంటే పెద్దది. ఆలయ ఎత్తు 350 అడుగులు. ఆలయ గోపురం వ్యాసం 177 మీటర్లు.

    ఆలయాన్ని సర్వాంగ సుందరగా.. చరిత్రలో కలకాలం నిలిచిపోయేలా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మార్బుల్స్ దిగుమతి చేసుకొని.. వాటితో మందిరాన్ని కట్టుతున్నారు.



    ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకునే విధంగా ఆలయ గోపురాన్ని డిజైన్ చేశారు. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు, ఎప్పుడు? ఎందుకు? దీని వెనుక కారణం ఏమిటి? అనే వివరాలు అందులో ఉంటాయి. అందుకే దీనిని వైదిక్ ప్లానిటోరియం అని కూడా అంటారు.

    వచ్చే ఏడాదిలోనే ఈ ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తేవాలని ఇస్కాన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి ఆలయం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Sri Krishna Janmashtami, West Bengal

    తదుపరి వార్తలు