మహాలయ అమావాస్య తేదీ? ఆరోజు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టడానికి నియమాలు.. ప్రాముఖ్యత

మహాలయ అమావాస్య (పేతర అమావాస్య) 2021 ఆశ్వియుజ మాస అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యను సర్వ పితృ లేదా మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం సర్వ పితృ అమావాస్య అక్టోబర్‌ 6న బుధవారం వస్తోంది.

మహాలయ అమావాస్య (పేతర అమావాస్య) 2021 ఆశ్వియుజ మాస అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యను సర్వ పితృ లేదా మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం సర్వ పితృ అమావాస్య అక్టోబర్‌ 6న బుధవారం వస్తోంది.

  • Share this:
బాధ్రపద పౌర్ణమి Full moon తర్వాత నుంచి ఓ పక్షం రోజులు పితృపక్షం pitru paksha గా పిలుస్తారు. ఆశ్వియుజ అమావాస్యతో ఈ పక్షం రోజులు ముగుస్తాయి. ఈ అమావాస్యను మహాలయ అమావాస్య లేదా సర్వప్రీతి అమావాస్య అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి ఈ రోజును శ్రాద్ధానికి చివరిరోజుగా నమ్ముతారు. ఈ  సర్వ పితృ అమావాస్యనాడు మనకు తెలిసిన, తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం. అంటే ముఖ్యంగా తమ బంధువులు ఏరోజు మరణించారో తెలియని వారు ఈ రోజు వారి పేరు మీద తర్పణం లేదా శ్రాద్ధం కూడా చేయవచ్చు. అయితే, ఈ ఏడాది మహాలయ అమావాస్య అక్టోబర్‌ 6 బుధవారం నాడు వస్తోంది. ఇది సర్వ పితృ అమావాస్యకు కచ్ఛితమైన రోజు. శ్రాద్ధం ప్రాముఖ్యత ఏ మిటో తెలుసుకుందాం.

సర్వ పితృ అమావాస్య..
ఆశ్వియుజ మాసంలో వచ్చే అమావాస్య తిథిరోజు అన్ని పితృ అమావాస్య తిథికి శ్రాద్ధం నిర్వహించడం ఆచారం. ప్రంచాంగం ప్రకారం అక్టోబర్‌ 5న సాయంత్రం 07:04 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 6 సాయంత్రం 04: 35 వరకు ఉంటుంది. అయితే, అక్టోబర్‌ 6న అమావాస్య తిథి సూర్యోదయం కారణంగా సర్వ పితృ అమావాస్య 6న మాత్రమే పరిగణిస్తారు. ఇది పితృపక్షం చివరి రోజు. ఆ తర్వాత రోజు నుంచి శుక్ల పక్ష ప్రతిపాద తేదీ నుంచి శార్దియ నవరాత్రి ప్రారంభం కానుంది.

తల్లులకు తర్పణం పెట్టే ఏకైక స్థలం.. మాతృమోక్ష స్థల్‌!మన సనాతన ధర్మ ప్రకారం చనిపోయిన పూర్వీకులు, బంధువులు పితృపక్షం రోజుల్లో భూమి పైకి వస్తారని నమ్మకం. అందుకే ఈ పక్షానికి ఇంత ప్రాముఖ్యత. ఈ పక్షం రోజులు వారికి శ్రద్ధ, తర్పణం చేయడం ఆచారం. పితృపక్షం తేదీల నియమాలను అనుసరించి శ్రాద్ధం నిర్వహిస్తారు.

కానీ, శ్రాద్ధానికి సర్వపితృ అమావాస్య ప్రత్యేకమైన రోజు. ఈ రోజు తెలిసిన, తెలియని బంధువులకు శ్రాద్ధం పెట్టడానికి ఒక నిర్ధిష్టమైన రోజు. పితృ పక్షంలో తమ చనిపోయిన వారి తిథిని మరచిపోయిన వారికి అమావాస్య అనువైన రోజు. ఈ రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు.

ఇవన్ని ఒక ఎత్తు అయితే... ఈ పక్షం రోజులు మగవారు కట్టింగ్, షేవింగ్‌ చేసుకోరు. ఎందుకంటే ఈ దినాలను సంతాప దినాలుగా బావిస్తారు. ముఖ్యంగా పితృపక్షం ముగిసే వరకు ఏ శుభకార్యాలు, కొత్త పనులకు కూడా పూనుకోరు. అంటే కొత్త బట్టలు, వస్తువులు, బంగారం, ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేయరు.
Published by:Renuka Godugu
First published: