Pitru paksha 2021: పితృపక్షంలో ఆచరించాల్సిన నియమాలు.. చేయాల్సిన పనులు!

ఈ పక్షం రోజులు కొత్త బట్టలు, వస్తువులు, బంగారం, కొత్త ఇల్లు, వాహనాలు ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. 

ప్రార్థనలు, ఆచారాలు పాటించడం వల్ల వారి ఆత్మకు శాంతి కలిగి ముక్తి కలిగుతుందని నమ్మకం. ఏవైనా పితృదోషలు ఉంటే ఉపశమనం కలుగుతుందంటారు.

  • Share this:
పితృపక్షం pitru paksha  అంటే చనిపోయిన మన పూర్వీకుల కోసం కేటాయించిన ప్రత్యేక పక్షం. ఈ పక్షంలో కొన్ని చేయాల్సిన.. చేయకూడని పనులు ఉన్నాయి. వీటిని ఆచరిస్తే.. పితృదోషాలు పోయి.. వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్మకం. అవేంటో తెలుసుకుందాం.

హిందూ కేలండర్‌ ఓ పదిహేను రోజులను కేవలం చనిపోయిన వారికోసం కేటాయించారు. వీటిని సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ రోజుల్లో చనిపోయిన వారికి శ్రాద్దం, తర్పణం, పిండ ప్రదానాలు చేస్తారు. ఈ పక్షం రోజుల్లో చనిపోయినవారు ఈ భూమ్మిదకు తమ వారిని చూడటానికి వస్తారని నమ్మకం. అందుకే వారి కోసం తర్పణాలు వంటివి చేస్తారు. దీన్నే పితృపక్షం అంటారు.

ఈ పక్షంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్‌ వెజ్‌ వంటి చికెన్, మటన్, చేపలు, ఘటైన వాసన వచ్చే ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోరు. మొత్తానికి చెప్పాలంటే కొంతమంది ఇళ్లలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు.   ప్రతి ఏడాది బాధ్రపద పౌర్ణమి నుంచి ఈ పక్షం మొదలవుతుంది. ఈ ఏడాది 2021 సెప్టెంబర్‌ 21 పితృపక్షం ప్రారంభం కానుంది.

 పితృపక్షంలో మగవారు ఈ పని ఎందుకు చేయరో తెలుసా?




  • ఈ పక్షం రోజులు కొత్త పనులకు శ్రీకారం చుట్టరు. అంటే నిశ్చితార్ధం, పెళ్లి, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలను చేపట్టరు.

  • పితృపక్షం ఆచరించిన రోజు ముఖ్యంగా బ్రహ్యచర్యం పాటించాలి. ఆరోజు ఉపవాసం చేయాలి.

  • ఎవరైనా పేద వారికి ఆహారాన్ని పెట్టాలి. ప్రతిఒక్క జీవికి ఆదరించాలి. అందుకే ఆవు, కుక్క, ఇతర జీవులకు ఏదైనా ఆహారంగా ఇవ్వాలి.

  • పండితుడిని కలిసి పాటించాల్సిన నియమాలను తెలుసుకుని తర్పణ, పిండ ప్రదానాలు చేపట్టాలి. ఈ శార్ధం పెట్టేటపుడు సాయంత్రం, రాత్రివేళల్లో పెట్టకూడదు.

  • ఏదైన రూపంలో మీ పూర్వీకులు రావచ్చు. అందుకే మూగజీవాలను కూడా ఈ సమయంలో ఆరాధిస్తారు.

  • మగవారు ధోతి కట్టుకొని పిండ ప్రదానాలు చే యాలి.

  • ఈ పక్షం రోజులు ప్రశాంతత వాతావరణంలో గడపాలి. ఎందుకంటే ఇవి సంతాప దినాలుగా భావిస్తారు.

  • పిండ ప్రదానం చేసేటపుడు అందులో వరిపిండి, నువ్వులు కలిపి చేస్తారు. వీటిని కాకులకు పెడతారు. ఎందుకంటే ఈ కాకులను యమదూతలని లేదా చనిపోయిన పూర్వీకులుగా భావిస్తారు.

Published by:Renuka Godugu
First published: