Home /News /astrology /

KNOW THE SIGNIFICANCE OF NAVRATRI DAY 6 AND MAA KATYAYANI PUJA VIDHI AND MANTRA AK GH

Navaratri Day 6: నవరాత్రుల్లో ఆరో రోజు.. కాత్యాయని అమ్మవారి పూజా విధానం, విశేషాలు

దుర్గాదేవి అమ్మవారు

దుర్గాదేవి అమ్మవారు

కాత్యాయని రూపం అంటేనే అత్యంత భయంకరమైన హింసాత్మక రూపంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే కాత్యాయని అమ్మవారిని దుష్ట సంహారణ దేవత ( warrior goddess) అని కూడా అంటారు.

దసరా ఉత్సవాలకు మన దేశంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దేశంలో చాలా ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. తొమ్మిది రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో నవరాత్రి షష్ఠి తిథి రోజున దుర్గమ్మ ఆరవ రూపంగా కాత్యాయనిగా దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి పార్వతీదేవి కాత్యాయని రూపంలో వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. కాత్యాయని రూపం అంటేనే అత్యంత భయంకరమైన హింసాత్మక రూపంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే కాత్యాయని అమ్మవారిని దుష్ట సంహారణ దేవత ( warrior goddess) అని కూడా అంటారు.

కాత్యాయని రూపంలోని అమ్మవారు బృహస్పతి గ్రహాన్ని పాలిస్తుంది. నాలుగు చేతులతో, సింహంపై స్వారీ చేస్తున్నట్టుగా అమ్మవారు దర్శనమిస్తారు. ఎడమ చేతులలో ఒక చేతిలో తామరపువ్వు, మరో చేతిలో ఖడ్గం, కుడి చేతుల్లో ఒక చేయి అభయ హస్తం, రెండవ చేతిలో వరద ముద్రలో కాత్యాయని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కాత్య అనే ఇంటిలో జన్మించడం వల్ల అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

* షష్ఠి తిథి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది
అక్టోబరు 11వ తేదీ సోమవారం అర్థరాత్రి 2:14 నుంచి రాత్రి 11:50 వరకు షష్ఠి తిథి ఉంటుంది.
అక్టోబరు 12న అభిజిత్ ముహూర్తం, రాత్రి 11:44 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు రవి యోగ అర్ధరాత్రి 12:56 నుంచి ఉదయం 6:29 వరకు ఉంటుంది. ఈ ముహూర్తాన్ని కాత్యాయని అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తాలుగా భావిస్తారు.

* పూజా విధానం
ఆరవ రోజు అమ్మవారు తెలుగు రంగులో దర్శనమిస్తారు. కాత్యాయని దేవి సింహాన్ని వాహనంపై అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తారు. పూజలో కొబ్బరి, గంగా జలం, కలవ, పసుపు, బియ్యం, తేనే, అగరొత్తులు, నైవేద్యం, నెయ్యి అమ్మవారి పూజలో ఉపయోగిస్తారు. పూజలో ఉపయోగించే కొబ్బరికాయను గుడ్డ ముక్కలో చుట్టి కలశంపై ఉంచాలి. ఆ తరువాత ముగ్గు, పసుపు, సిందూరంతో కాత్యాయని అమ్మవారిని పూజిస్తారు. ఓం దేవి కాత్యాయన్యైనమ: అంటూ కాత్యాయని మంత్రాన్ని భక్తులు 108 సార్లు చదివి విగ్రహానికి సమర్పిస్తారు.

* కాత్యాయని పూజ ప్రత్యేకతలు
చాలా కాలంలో వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్న వారు, వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కాత్యాయని దేవి అమ్మవారి పూజ ముఖ్యమైనది. వివాహ దోషాలను తొలగించడం, వైవాహిక సమస్యలన్నింటినీ తొలగించడంలో ఈ పూజ ఉపయోగపడుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు.

* కాత్యాయని అమ్మవారి మంత్రం
ఓం దేవి కాత్యాయన్యైనమ:
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Navaratri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు