హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Ayuda Puja: ఈ నవరాత్రి రోజు ఆయుధ పూజ చరిత్ర, అర్థం ప్రాముఖ్యత తెలుసుకోండి..

Ayuda Puja: ఈ నవరాత్రి రోజు ఆయుధ పూజ చరిత్ర, అర్థం ప్రాముఖ్యత తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ayuda Puja: ఆయుధ పూజ అంటే ఆయుధాలు పూజ. మన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చే సాధనాలు ,ఆయుధాలను పూజించే సందర్భం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Ayuda Puja:  ఆయుధ పూజ (Ayuda Puja) అంటే ఆయుధాలు పూజ. మన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చే సాధనాలు,ఆయుధాలను పూజించే సందర్భం. అంతేకాదు ఆయుధపూజ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, దుర్గామాత (Durga maata)  మహిషాసురుని సంహరించిన వేడుకకు ప్రతీక అని అంటారు.నవరాత్రి (Navaratri) ఉత్సవాల్లో భాగంగా దీనిని జరుపుకుంటారు.

ఆయుధ పూజ అంటే ఏమిటి?

'అస్త్ర పూజ' అని కూడా పిలుస్తారు. వివిధ వర్గాలవారు వారు ఉపయోగించే వాయిద్యాలు, ఆయుధాలు, యంత్రం, ఉపకరణాలు మొదలైన వాటిని పూజించి శుభ్రపరిచే రోజు.

ఈ సాధనాలు కత్తులు లేదా స్పానర్‌లతో పాటు కంప్యూటర్లు, భారీ యంత్రాలు, కార్లు ,బస్సుల వంటి పెద్ద పరికరాలను కూడా పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పూజతో పాటు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి: సద్దుల బతుకమ్మ .. చాలా ప్రత్యేకమైందని తెలుసా?

చారిత్రక సూచన..

ఆయుధ పూజ కథ మహుషాసుర అనే రాక్షసుడిని సంహరించడంతో ముడిపడి ఉంది. హిందూ పురాణాల ప్రకారం మహిషాసురుడు ఒక స్త్రీ మాత్రమే తనను చంపగలిగేలా బ్రహ్మ దేవుడు నుంచి వరం పొందుతాడు. ఆ తర్వాత రాక్షసుడు అమాయక ప్రజలను ఊచకోత కోయడం ప్రారంభించాడు.

అప్పుడు దేవతలందరూ ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మదేవుడిని వేడుకున్నారు.మహిషాసురుడిని అంతం చేసే పనిని దుర్గాదేవికి అప్పగించారు. రాక్షసుడిని ఓడించడానికి దేవతలందరూ ఆమెకు తమ ఆయుధాలను ఇచ్చారు.

ఆధ్యాత్మిక ,తాత్విక అర్థం..

ఆధ్యాత్మిక గురువులు ,నిపుణుల అభిప్రాయం ప్రకారం వాయిద్యాలు ,ఆయుధాలను పూజించడం సఫలీకృతమైన అనుభూతిని ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి అతను/ఆమె కలిగి ఉన్న వస్తువులపై గౌరవం చూపినప్పుడు, అది విశ్వంతో సామరస్యాన్ని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: నవరాత్రి 9వ రోజు అమ్మవారి అలంకరణ ఏంటి? నైవేధ్యం, రంగు వస్త్రం..

ఆయుధపూజలో ఆచారాలు..

ఈ రోజున అన్ని యంత్రాలను పూర్తిగా శుభ్రం చేసి పూజిస్తారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆశీర్వాదం కోసం ,ఆమె సాధించిన విజయాన్ని గుర్తించడానికి వారి సాధనాలను కూడా అమ్మవారి ముందు ఉంచుతారు.

పనిముట్లు ,వాహనాలపై పసుపు, చందనం (తిలకం) మిశ్రమాన్ని పూస్తారు. కొంతమంది వీటిని పూలతో అలంకరిస్తారు.

ఈ ఏడాది ఆయుధ పూజ నవరాత్రి 4వ తేదీ అంటే రేపు ఆయుధ పూజ నిర్వహించనున్నారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Dussehra, Dussehra 2022

ఉత్తమ కథలు