Home /News /astrology /

KNOW ABOUT THE PREDICTIONS OF HOROSCOPE OF PEOPLE BELONGS TO DIFFERENT ZODIAC SIGNS AK GH PJC

Horoscope Today: జనవరి 7 రాశి ఫలాలు.. 12 రాశుల వారికి నేడు ఎలా ఉండబోతుందంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేడు ఒక రాశి వారు (Astrological Signs) వెన్నుపోటు పొడిచే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. మొత్తం మీద ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

(పూజా చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

జనవరి 7, శుక్రవారం నాడు ఈరోజు కొన్ని రాశుల వారికి (Zodiac Signs) జ్యువెలరీ షాపింగ్ చాలా లాభదాయకంగా ఉండనుంది. ఇవాళ (Horoscope Today) కొన్ని రాశులవారిని ఒక సదవకాశం వెతుక్కుంటూ రావచ్చు. నేడు ఒక రాశి వారు (Astrological Signs) వెన్నుపోటు పొడిచే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. మొత్తం మీద ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
మేషరాశి వారి వర్క్ ఎన్విరాన్‌మెంట్ లో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈరోజు మీరు తీర్థయాత్రను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. బంధువులు మిమ్మల్ని కలవాలనుకోవచ్చు. ఇందుకు నేరుగా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయవచ్చు లేదా వర్చువల్ పార్టీని నిర్వహించవచ్చు.

లక్కీ సైన్ - పసుపు నీలమణి

* వృషభం (Taurus) : ఏప్రిల్ 20-మే20
వయసు పైబడిన ఒక పెద్ద వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారు. అయితే మీరు మీ నిజమైన అభిప్రాయాన్ని వివరించడానికి నిర్దిష్ట వ్యూహం గురించి ఆలోచించడానికి ఇదే మంచి రోజు. తద్వారా మీరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారి అభిప్రాయాన్ని మార్చవచ్చు. ఈరోజు కొత్త వెంచర్ కోసం ప్లాన్ చేయడం అంత మంచిది కాదు. ఇందుకు కనీసం రెండు మూడు నెలలు వేచి చూడండి.

లక్కీ సైన్ - ఒక పట్టు కండువా

* మిథునరాశి (Gemini) : మే 21- జూన్ 21
ఈరోజు జ్యువెలరీ షాపింగ్ లాభదాయకంగా ఉంటుంది. రాబోయే సంవత్సరానికి ఏదైనా ప్లాన్ సెట్ చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. మీకు విజన్ ఉన్నట్లయితే.. ఆ ఆలోచనలు త్వరలో రూపుదిద్దుకుంటాయి. బాస్ లేదా సీనియర్‌కి మీ నుంచి సహాయం అవసరం కావచ్చు.

లక్కీ సైన్ - వెండి దారం లేదా వైర్

* కర్కాటకం (Cancer): జూన్ 22- జూలై 22
విషపూరితంగా మారుతున్న ఒక రిలేషన్ షిప్ త్వరలో ముగిసే సంకేతాలను మీరు ఈ రోజు గమనించవచ్చు. లేదా మీరే ఆ బంధాన్ని తుంచివేయడం ప్రారంభించవచ్చు. మీ జీవితంలోకి ఒక సదావకాశం రావచ్చు. ఆ అవకాశాన్ని జారవిడుచుకోకండి. నిలిచిపోయిన ఆర్థిక పరిస్థితులు ఈరోజు ముందుకు సాగడం ప్రారంభిస్తాయి.

లక్కీ సైన్ - అకస్మాత్తుగా కురిసిన వర్షం

* సింహం (Leo): జూలై 23- ఆగస్టు 22
మీరు ఎంత దాచుకోవాలనుకున్నా.. ఈరోజు మీ భావోద్వేగాలను నిలువరించడం సాధ్యం కాకపోవచ్చు. సన్నిహిత మిత్రుడు అందించే సలహాను వినండి. ఈరోజు ఎనర్జీలు ఏదో ఒక రకమైన లాభాల వైపు మళ్లించబడతాయి.

లక్కీ సైన్ – ఒక ఐస్ క్రీం విక్రేత

* కన్య (Virgo): ఆగస్టు 23-సెప్టెంబర్ 22
మీరు కొత్త స్నేహితులను సంపాదించుకునే అద్భుతమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉన్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి అసూయపడుతుంటారు. ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉండవచ్చు. ఇలా వెనుక గోతులు తవ్వే వారెవరో గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువగా చర్చలు చేయకుండా అన్ని కొత్త ప్లాన్స్ రహస్యంగా ఉంచండి.

లక్కీ సైన్ - ఆకట్టుకునే రేడియో షో

* తుల (Libra) : సెప్టెంబర్ 23- అక్టోబర్ 23
సమయపాలన లేదా టైం మేనేజ్‌మెంట్‌ లేకపోవడం మీకు ఒకటి లేదా రెండు పాఠాలు నేర్పుతుంది. మీ లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. అవి భవిష్యత్తులో నెట్‌వర్కింగ్ లీడ్స్‌కు సహాయపడతాయి. మీ పిల్లలకు ఒక ఆహార పదార్థం కారణంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు.

లక్కీ సైన్ - ఎరుపు రిబ్బన్

* వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
మీ ఆఫీసులో ఇద్దరు లేదా ముగ్గురు సహోద్యోగులు మీకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా మెలగండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అసైన్‌మెంట్‌ను కొనసాగించవచ్చు. ఈ అసైన్‌మెంట్‌కు ఎక్కువగా ఆలోచించకుండా ఓకే చెప్పండి. బయట ఎక్కువగా తినడం మానుకోండి. ఫిట్‌నెస్ కోసం రెగ్యులర్ గా ఒక పద్ధతిని ఫాలో అవ్వండి.

లక్కీ సైన్ - ఫోటో ఫ్రేమ్

* ధనుస్సు (Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
మీరు పనితో పాటు కుటుంబ సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, అది ఇప్పుడే చేయాలి. మరచిపోయిన పనికి సంబంధించిన పరిణామాలు మీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో గమనిస్తారు. విద్యార్థులకు రాబోయే విషయాలపై చాలా స్పష్టత వస్తుంది.

లక్కీ సైన్ - గర్భిణీ స్త్రీ

* మకరం (Capricorn) : డిసెంబర్ 22 - జనవరి 19
ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు మరికొంత సమయం పాటు కృషి చేయాల్సి రావచ్చు. తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా తన సపోర్టును ఉపసంహరించుకోవచ్చు. ఈరోజు మీరు నిరాశానిస్పృహల్లో మునిగితేలవచ్చు. అలాగే ఎవరితోనూ కనెక్ట్ కాకుండా ఒంటరిగా సమయం గడపవచ్చు. ఇలాంటి టైంలో ఆఫీసులో జరిగే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఈ మేరకు మీ కోసం కొంత సమయం తీసుకోండి. లాయర్లు, టెక్నీషియన్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు.

లక్కీ సైన్ - పురాతన గడియారం

* కుంభం (Aquarius): జనవరి 20- ఫిబ్రవరి 18
ఈ రోజు మీరు మానసిక విశ్రాంతిని పొందుతారు. అలాగే మీ ఎమోషనల్ సైడ్ స్థిరంగా ఉంటుంది. మీరు మీ కోసం వేచి చూసేవారికి తిరిగి కాల్ చేయడానికి కొంత సమయం కేటాయించండి. ఈరోజు విందు భోజనం లేదా కొన్ని విహారయాత్రలు చేయవచ్చు. మీ ఆఫీసులో మిమ్మల్ని ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు.

లక్కీ సైన్ - సరికొత్త స్టోర్

* మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
మీరు ప్రస్తుతం ఉన్న స్థితిలో సౌకర్యంగా, సుఖంగా, నిశ్చింతగా ఉండేలా మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి. అలా కాకుండా మీరు బాగా బాధపడితే ప్రస్తుత పరిస్థితి మరింత దుర్భరంగా మారొచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలు లేదా బాల్య వ్యామోహం మీ భావోద్వేగ శూన్యతను పూరించవచ్చు. ఈరోజు కొంత సమయం పాటు ప్రకృతిలో గడపండి.

లక్కీ సైన్ - పొడవైన గాజు
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Horoscope Today, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు