Home /News /astrology /

KNOW ABOUT THE HOROSCOPE OF DIFFERENT ZODIAC SIGNS FOR TODAY SNR GH PJC 3

Horoscope :జనవరి 25అనగా ఈరోజున ఈ రాశుల గల వారు మరికొంత కాలం జీవిత భాగస్వామి కోసం ఎదురుచూడాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: భవిష్యత్తును ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుకరిస్తారు. మరి 12 రాశుల వారికి నేటి (జనవరి 25) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.  

(పూజా చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

మేషం : (మార్చి 21-ఏప్రిల్ 19)
ఈరోజు మీకు ప్రారంభంలో కొంత చిరాకులు తలెత్తుతాయి. దాని వల్ల కాస్త ఇబ్బందులు పడతారు. రోజును ఆనందంగా ముగిస్తారు. ఆశ్చర్యకరమైన వార్తను వినడం వల్ల కొంత సంతోషంగా ఉంటారు.
అదృష్ట చిహ్నం:- ఉదయాన్నే వార్తలు

వృషభం : (ఏప్రిల్ 20-మే20)
మీకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఎదుటి వాళ్లను నమ్మకపోవడం మంచిది. మీరు మరింత చురుగ్గా పని చేయడానికి తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటారు. కొత్త విషయాల ద్వారా సంతృప్తి చెందుతారు.
అదృష్ట చిహ్నం:- ఒక కోల్లెజ్

మిథునం : (మే 21- జూన్ 21)
ఎదుటి వాళ్లతో వాదించకపోవడం మంచిది. అది మీకే మంచి ఫలితాలను కలిగిస్తుంది. మీ గురించి అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యంగానైనా అది నిరూపణ అవుతుంది. ఉద్యోగమార్పు కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఒత్తిడి ఉన్నప్పటికి బాధ్యతల నిర్వాహణలో సంయమనం మంచిది అది మీకు ఎంతో ఉపయోగకరం.
అదృష్ట చిహ్నం:- ఆకాశంలో ఒక రాశి

కర్కాటకం : (జూన్ 22- జూలై 22)
మీ అలవాట్లు మార్చుకోమని కొందరు సలహాలు ఇస్తారు. ఈవిషయంలో స్వల్ప విభేదాలు, ఘర్షణలు కూడా తలెత్తే అకాశం ఉంది. ఈ పరిస్థితు కారణంగా మీరు కొందరికి దూరం అవుతారు. ఆలస్యమైనప్పటికి అవతలి వ్యక్తి మీ మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటారు.
అదృష్ట చిహ్నం - చెప్పులు కుట్టేవాడు

సింహరాశి: (జూలై 23- ఆగస్టు 22)
ఆర్ధిక లావాదేవీల విషయంలో పర్వాలేదు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. త్వరలోనే ఆదాయం సమకూరే మార్గం దొరుకుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టండి.
అదృష్ట చిహ్నం:- వెండి ట్రే

కన్య: (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
మీ హృదయం ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తోంది. జీవిత భాగస్వామి కోసం ఎదురుచూపు తప్పదు. ఆరోగ్యం, దినచర్యపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. అది మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.
అదృష్ట చిహ్నం:- అలారం గడియారం

తుల : (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
వ్యాపారస్తులు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని చట్టపరమైన వ్యవహారాల్లో తలదూర్చాల్సి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు ఓ మంచి వ్యక్తిని కలుస్తారు.
అదృష్ట చిహ్నం:- పండ్ల ప్లేట్

వృశ్చికం: (అక్టోబర్ 24 - నవంబర్ 21)
పని ఒత్తిడి పెరగడం వల్ల మీకు ఎక్కువ విశ్రాంతి లభించకపోవచ్చు. సాధ్యమైనంత వరకు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. మీ నుంచి కీలకమైన సమాచారం రాబట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు..వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి.
అదృష్ట చిహ్నం:- మీకు ఇష్టమైన కారు ఫోటో

ధనుస్సు: (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఉదయం కాస్త బద్దకంగా ఉంటారు. స్నేహితులను కలవడం ద్వారా సాయంత్రానికి చురుగ్గా వ్యవహరిస్తారు. ఫ్రెండ్స్‌తో కలవడం మీకు మంచి ఫలితాల్ని ఇస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది.
అదృష్ట చిహ్నం:- ఒక కొత్త నవల

మకరం : (డిసెంబర్ 22 - జనవరి 19)
మిమ్మల్ని పాత స్నేహితులు కొందరు కలవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజంతా కాస్త బడలికగానే ఉంటారు. మీ ప్రవర్తనపై తల్లిదండ్రులు మీకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఈవిషయంలో మీరు వాళ్లు చెప్పేది వింటే మంచి జరుగుతుంది.
అదృష్ట చిహ్నం:- కఠినమైన రహదారి

కుంభం : (జనవరి 20- ఫిబ్రవరి 18)
మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది ఇంకా దూరమవుతుంది. అనుకున్నది సాధించడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈవిషయంలో మీరు కొంత వెనుకబడతారు. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్న పనులు ఈ ఏడాదిలో పూర్తి చేస్తారు.
అదృష్ట చిహ్నం:- కారు నంబర్ 

మీన: (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఆలస్యంగా ఉదయాన్ని ప్రారంభిస్తారు. పని చేసే ఆసక్తి లేకపోయినప్పటికి మధ్యాహ్నం నుంచి మీరు చురుగ్గా వ్యవహరిస్తారు. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉంటారు. కానీ అందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది.
అదృష్ట చిహ్నం:- బంగారు ఉంగరం
Published by:Siva Nanduri
First published:

Tags: Horoscope, Horoscope Today

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు