Home /News /astrology /

KNOW ABOUT THE HOROSCOPE OF DIFFERENT ZODIAC SIGNS FOR TODAY SNR GH PJC 2

Horoscope Today: జనవరి 17 రాశి ఫలాలు.. వీరు పెండింగ్​ పనులు పూర్తి చేస్తారు, కొత్త వ్యక్తులను కలుస్తారు

Horoscope: today

Horoscope: today

తమ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా భవిష్యత్తును అంచనా వేయడానికి రాశి ఫలాలు సహాయప?

(పూజా చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

Horoscope Today: జనవరి 17 రాశి ఫలాలు.. వీరు పెండింగ్​ పనులు పూర్తి చేస్తారు, కొత్త వ్యక్తులను కలుస్తారు.తమ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా భవిష్యత్తును అంచనా వేయడానికి రాశి ఫలాలు సహాయపడతాయి. జనవరి 17 (సోమవారం) నాడు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి: (మార్చి 21– -ఏప్రిల్ 19)
ఈ రోజు మీకు ఉత్సాహంగా గడుస్తుంది. కొత్త పనులను ప్రారంభించేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ రోజు మీ శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపించవచ్చు. మీరు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. వాటిని పూర్తి చేయడానికి మానసికంగా సిద్దమవ్వండి.

అదృష్ట చిహ్నం: లోహ పాత్ర

వృషభ రాశి: (ఏప్రిల్ 20 – -మే20)
ఈ రోజు ఎక్కువ భావోద్వేగాలకు లోనవుతారు. మీ భావోద్యోగాలను పంచుకోవడానికి, వ్యక్తీకరించడానికి సరైన వ్యక్తి కోసం వెతుకుతారు. మీరు ఇవాళ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు కలిసొస్తాయి.

అదృష్ట చిహ్నం:- బంతి పువ్వులు

మిథున రాశి: (మే 21 – జూన్ 21)
మీకు నేటి ఉదయం ఒత్తిడితో ప్రారంభమవుతుంది. అయితే, సాయంత్రం కల్లా కాస్త రిలాక్స్​ అవుతారు. ఉద్యోగ పరంగా మీకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చిన కొత్త ఆలోచనలు రూపుదిద్దుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

అదృష్ట చిహ్నం: గిఫ్ట్ బాక్స్​

కర్కాటక రాశి: (జూన్ 22 – జూలై 22)
మీ పనికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రమోషన్లకు ఉపయోగపడుతుంది. మీలో కొత్త వ్యాపార ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఎక్కువ శ్రద్ద వహించండి. సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించండి.

అదృష్ట చిహ్నం: చిలుక

సింహ రాశి: (జూలై 23 –- ఆగస్టు 22)
ఇవాళ మీ జీవితాన్ని మార్చగలిగే అత్యంత ప్రతిభ గల వ్యక్తిని కలుస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం మీ కుటుంబ విషయాలపైనే కేంద్రీకరిస్తారు. అయితే, ఈ రోజు టైమ్​ మేనేజ్​మెంట్​ మీకు పెద్ద సవాలుగా అనిపించవచ్చు.

అదృష్ట చిహ్నం: కంచెతో కూడిన తోట

కన్యా రాశి: (ఆగస్టు 23 – -సెప్టెంబర్ 22)
ఈ రోజు మీకు సవాలుగా మారుతుంది. నెగెటివ్​ శక్తులు మిమ్మల్ని వెనక్కు లాగుతాయి. మీ చుట్టూ ఉన్న వారే మీపై నెగెటివ్​ ఆలోచనలు చేసే అవకాశం ఉంది. అందుకే, ఆఫీసులో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి.

అదృష్ట చిహ్నం:- ఫెంగ్‌షుయ్ చిహ్నం

తులా రాశి: (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 23)
ప్రతి చిన్న విషయానికి అనవసరమైన ఒత్తిడికి గురికావద్దు. ఏ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే దానిపై అవగాహన పెంచుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా మీ జీవిత భాగస్వామితో చర్చించడం మంచిది.

అదృష్ట చిహ్నం: మల్టీ కలర్​ కార్పెట్

వృశ్చిక రాశి: (అక్టోబర్ 24 –- నవంబర్ 21)
మీ పట్ల ఆకర్షితులైన వారు మిమ్మల్ని త్వరలోనే కలుసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. మీరు ఇవాళ తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని రోజుల తరబడి ఆనందపరచవచ్చు.

అదృష్ట సంకేతం: అలారం గడియారం

ధనుస్సు రాశి: (నవంబర్ 22 –- డిసెంబర్ 21)
మీ చెడు అలవాట్లను సకాలంలో సరిదిద్దుకోండి. లేదంటే అవి అలవాటుగా మారి భవిష్యత్తులో హానికరంగా మారతాయి. మీ కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. ఇవాళ ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.

అదృష్ట చిహ్నం: ఫ్లోరల్​ ప్రింట్​

మకర రాశి: డిసెంబర్ 22 – జనవరి 19
ఈ రోజంతా వాయిదాలతో గడుపుతారు. అందుకే, మీరు కొన్ని ముఖ్యమైన పనులను రీషెడ్యూల్ చేయాల్సి రావచ్చు. కొత్త పనులను చేపట్టడం అంత లాభదాయకం కాకపోవచ్చు. అందుకే మంచి సమయం కోసం వేచి చూడండి.

అదృష్ట సంకేతం:- పండ్ల బుట్ట

కుంభ రాశి: (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈ రోజు ఉదయం మీకు చాలా నెమ్మదిగా గడుస్తున్న ఫీలింగ్​ కలుగుతుంది. అయితే, మధ్యాహ్నం నాటికి క్రమంగా పుంజుకోవచ్చు. బంధువుల నుంచి సహకారం అవసరం అవుతుంది. మీరు మీ కుటుంబంతో చాలా కాలం నుంచి వెకేషన్​కు ప్లాన్​ చేస్తున్నట్లతే.. ఇదే సరైన సమయం.

లక్కీ సైన్:- ఒక గాజు గిన్నె

మీన రాశి: (ఫిబ్రవరి 19 –- మార్చి 20)
మీ జీవితంలో గతంలో జరిగిన ఛేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆయా సంఘటనలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే, త్వరగానే పాత ఆలోచనల నుంచి బయటపడతారు. త్వరలో స్నేహితులతో కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేయాలనే కోరిక కలుగుతుంది. మీరు చేపట్టే పనులను వేగంగా పూర్తి చేస్తారు.

అదృష్ట చిహ్నం:- పాత ఫోటో
First published:

Tags: Horoscope, Horoscope Today

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు