KNOW ABOUT THE HOROSCOPE OF DIFFERENT ZODIAC SIGNS FOR TODAY GH PJC SNR 2
Horoscope Today: జనవరి 19 రాశిఫలాలు.. ఆ రాశులవారికి అలర్ట్.. చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం
Horoscope Today: జనవరి 19 రాశిఫలాలు.. ఆ రాశులవారికి అలర్ట్.. చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం
Horoscope: గ్రహాల గమనాల ఆధారంగా మన రాశి ఫలాలను అంచనా వేస్తుంటారు జ్యోతిష్య నిపుణులు. వివిధ రాశుల వారు ఎదుర్కొనే పరిస్థితులను రాశి ఫలాల ద్వారా గుర్తించవచ్చు. జనవరి 19, బుధవారం రాశిఫలాలు చూద్దాం.
(పూజ చంద్ర, జ్యోతిష్య నిపుణులు) మేషం: (మార్చి 21-ఏప్రిల్ 19)
వృత్తిపరంగా కంపెనీలోని ప్రభావవంతమైన వ్యక్తులతో మంచి బంధాన్ని కలిగి ఉంటారు. మీలో కొంతమందికి హోమ్‌సిక్ అనిపిస్తే, ఇంటికి తిరిగి వెళ్లడానికి ఇది సమయం. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భం, పని ఈరోజు జరిగే అవకాశం ఉంది. లక్కీ సైన్- కొత్త రోడ్డు
వృషభం: (ఏప్రిల్ 20-మే20)
ఈరోజు మీరు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి ఎమోషనల్ ఫీలింగ్స్‌ను చెక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి, అనవసరంగా టైమ్ వేస్ట్ చేయకండి. లక్కీ సైన్- బ్లూ కలర్ బాటిల్
మిథునరాశి: (మే 21- జూన్ 21)
రీసెంట్ ట్రిప్ మరిన్ని ట్రిప్స్‌ను ప్లాన్ చేసేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. పాత పరిచయస్తులతో నెట్వర్కింగ్ ప్రారంభించవచ్చు. ఈరోజు ఒక కొత్త సవాలు మిమ్మల్ని బిజీగా ఉంచవచ్చు. లక్కీ సైన్ - కలర్ పేపర్
కర్కాటకం: (జూన్ 22- జూలై 22)
కొన్ని విషయాలు మీకు పాత రోజులను గుర్తు చేస్తాయి. వర్క్ పర్ఫెక్షన్ కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించడం మంచిది. ఇంట్లో సరైన వర్క్ ప్లేస్‌ను క్రియేట్ చేయాలని అనిపిస్తే, మీరు ఈరోజే ఈ పని చేయవచ్చు. లక్కీ సైన్ - మీకు ఇష్టమైన చిరుతిండి
సింహం: (జూలై 23- ఆగస్టు 22)
ఈరోజు ఏదైనా చారిటీ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావచ్చు. ఇంట్లో ఏదైనా వాగ్వాదం జరిగితే, దాన్ని అంతటితోనే వదిలివేయడం మంచిది. మీ పిల్లలు మీ కోసం ఏదైనా స్పెషల్ ప్లాన్ చేసుకోవచ్చు. లక్కీ సైన్ - ఇండోర్ హాబీ
కన్య: (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
మరీ ప్రాక్టికల్‌గా ఉండటం వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. మీ వైఖరి వల్ల మీ సన్నిహితులు ఎవరైనా బాధపడవచ్చు. ఏదైనా కొత్త వర్క్ షెడ్యూల్‌ను రూపొందించడానికి ఇది మంచి రోజు. లక్కీ సైన్- పండ్ల బుట్ట
తుల: (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
ఒక ఇన్నర్ ఫియర్ నుంచి మీకు ఈ రోజు విముక్తి కలుగుతుంది. దూరంగా ఉంచుతున్న వ్యక్తిని కలవాలనిపిస్తుంది. ఒక మైనర్ ర్యాష్, స్కిన్ అలర్జీ మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. లక్కీ సైన్- సాఫ్ట్ ఫ్యాబ్రిక్
వృశ్చికం: (అక్టోబర్ 24 - నవంబర్ 21)
మీ గురించి కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టవచ్చు. మీరు వాటి గురించి వింటారు. వీటి గురించి పెద్దగా స్పందించకపోవడం మంచిది. లక్కీ సైన్ - రెండు పిచ్చుకలు
ధనుస్సు: (నవంబర్ 22 - డిసెంబర్ 21)
మీరు పాత ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వాలని ఆలోచిస్తుంటే, ఆ పని ఈరోజే చేయండి. మీరు ఓల్డ్ రొటీన్ విషయంలో కొత్త ఉత్సాహాన్ని ఫీల్ అవుతారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కొత్త వెల్నెస్ రొటీన్ ప్లాన్ చేయవచ్చు. లక్కీ సైన్ - ఒక బుక్ షాప్
మకరం: (డిసెంబర్ 22- జనవరి 19)
ప్రతి రోజు కొత్తగా ప్రారంభించాలని అనిపించదు. ఈరోజు ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మళ్లీ ఆలోచిస్తారు. మీ పర్స్పెక్టివ్స్ను మార్చుకునే రోజు ఇది. లక్కీ సైన్- ఈక
కుంభం: (జనవరి 20- ఫిబ్రవరి 18)
మీకు ఈరోజు రిలాక్సింగ్‌గా అనిపించవచ్చు. మిమ్మల్ని మీరు విలాసంగా ఉంచుకునేందుకు వెల్నెస్ యాక్టివిటీస్‌లో మునిగిపోవడానికి ఇది మంచి రోజు. ఎవరినైనా అప్పు అడగడం మంచిది కాదు. అతిగా ఆహారం తీసుకునేవారైతే, దాన్ని పరిమితం చేసుకోండి. లక్కీ సైన్- వెదురు మొక్క
మీనం: (ఫిబ్రవరి 19- మార్చి 20)
ఏదైనా క్రిటికల్ రెస్పాన్స్ కోసం మీరు ఎదురుచూస్తుంటే, ఈ విషయంలో చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా పరిస్థితి నుంచి మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో మళ్లీ పరిశీలించాల్సి ఉంటుంది. ఊహించని ఫోన్ కాల్‌తో ఈ రోజు సంతోషంగా ఉంటారు. లక్కీ సైన్- ట్రాఫిక్ సిగ్నల్
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.