KNOW ABOUT THE HOROSCOPE OF DIFFERENT ZODIAC SIGNS FOR TODAY GH PJC SNR
Horoscope Today: జనవరి 18 రాశిఫలాలు.. ఆ రాశుల వారు రోజును ఇలా ప్రారంభించడం మంచిది..
Horoscope: today
రాశులు, రాశి ఫలాలు మన రోజువారీ వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల గమనం ఆధారంగా మనం భిన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనవరి 18, మంగళవారం నాడు ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
మేషం: (మార్చి 21-ఏప్రిల్ 19)
కొన్ని అనుకోని సమస్యల కారణంగా మీ రోజు ముందుగానే ప్రారంభమవుతుంది. వర్క్ ప్లేస్ సౌకర్యవంతంగా, మేనేజబుల్గా ఉంటుంది. ఒక కొత్త, ఇంట్రస్టింగ్ విజన్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది.
లక్కీ సైన్- లిలక్ ఆర్ట్‌వర్క్
వృషభం: (ఏప్రిల్ 20- మే20)
కొన్ని విషయాల్లో తీవ్రమైన చర్చలు మరింత ఆలస్యానికి దారితీయవచ్చు. మీ కన్వర్జేషన్, కమ్యూనికేషన్లో గందరగోళానికి చెక్ పెట్టండి. ఒక లీడ్ ద్వారా మీ పని సులభతరం అవుతుంది.
లక్కీ సైన్- ఒక చెక్క పెట్టె
మిథునం: (మే 21- జూన్ 21)
మీ వర్క్ మరింత స్థిరంగా కనిపిస్తుంది. కొత్త ఆలోచనలపై సుదీర్ఘమైన చర్చలు నడిచే అవకాశం ఉంది. మీరు ఎవరితోనైనా డేటింగ్ చేస్తుంటే, వారు కొన్ని విషయాల్లో మీతో విభేదించవచ్చు.
లక్కీ సైన్- మిర్రర్ వర్క్
కర్కాటకం: (జూన్ 22- జూలై 22)
డల్, డైలీ రొటీన్ కారణంగా ఈ రోజు మీరు అసౌకర్యంగా ఉండవచ్చు. అయితే ఆహార పదార్థాలపై దృష్టి పెట్టడం, చర్చించడం సరదాగా అనిపించవచ్చు. రీడింగ్, ఎంటర్టైన్మెంట్ బింజ్ వాచింగ్ (binge watching)పై మీరు దృష్టి పెట్టడం మంచిది.
లక్కీ సైన్- చిలుక
సింహం: (జూలై 23- ఆగస్టు 22)
ఈరోజు ఒత్తిడితో ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే ఒక గుడ్‌న్యూస్.. మీ రోజును బ్యాలెన్స్డ్గా మార్చవచ్చు. క్లోజ్ ఫ్రెండ్‌తో మనసువిప్పి మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ సైన్ - పాత డైరీ
కన్య: (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
రోజు కీ జాబ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని విషయాల్లో అనుకోని ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు విన్నదంతా నమ్మకపోవడం మంచిది.
లక్కీ సైన్- ఇండోర్ గేమ్
తుల: (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
మీ స్పేస్‌ను క్లియర్ చేయడానికి, ఆర్గనైజ్డ్గా మారడానికి ఇది మంచి రోజు. వర్క్ లేదా ఇంటి విషయాల్లో ముఖ్యమైన విషయాన్ని కనుగొనవచ్చు. మీ గట్ హెల్త్‌ను జాగ్రత్తగా చూసుకోండి.
లక్కీ సైన్- గాజు సీసా
వృశ్చికం: (అక్టోబర్ 24- నవంబర్ 21)
కొంత సమయం విరామం తీసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టండి. ఎక్కడ ఉన్నా, పని ఏదైనా.. మీ అవసరం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించవచ్చు.
లక్కీ సైన్- స్టేషనరీ బాక్స్
ధనుస్సు: (నవంబర్ 22- డిసెంబర్ 21)
పోగొట్టుకున్న వస్తువు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న ట్రిప్, టూర్ ప్లాన్ చేస్తే, అది కార్యరూపం దాల్చవచ్చు. స్పోర్ట్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు.
లక్కీ సైన్- సైకిల్ బెల్
మకరం: (డిసెంబర్ 22- జనవరి 19)
సరైన డైరెక్షన్లో చేసిన చిన్న ప్రయత్నం మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండవచ్చు. మీ ఇన్నర్ వాయిస్ ఆధారంగానే ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీలో ఎవరైనా కొంతకాలం అనారోగ్యంగా ఉంటే, ఈ రోజు మీకు బాగుంటుంది.
లక్కీ సైన్ - కొత్త కత్తిపీట
కుంభం: (జనవరి 20- ఫిబ్రవరి 18)
ఈరోజు షాపింగ్ చేయడానికి ఒక ప్లాన్‌ను అనుసరించవచ్చు. రోజువారీ పనులను బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. గత సమస్యలను తాత్కాలిక పరిష్కారంతో పరిష్కరించవచ్చు.
లక్కీ సైన్- గొడుగు
మీనం: (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీ అభిప్రాయానికి విరుద్ధంగా ఉండే సహోద్యోగి మంచి ఉద్దేశాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రకృతికి దగ్గరగా ఉండటం.. మీ రోజుకు మంచి ప్రారంభం కావచ్చు. పిల్లలకు కొంత పర్యవేక్షణ అవసరం కావచ్చు.
లక్కీ సైన్- వేలాడే ప్లాంటర్లు
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.