Home /News /astrology /

KEEPING THESE ITEMS IN NORTH EAST DIRECTION BRINGS HAPPINESS TO THE HOME RNK

Vastu: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే .. ప్రశాంతతకు కొదవుండదు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది తెలియక వెస్ట్‌సౌత్, నార్త్‌ వెస్ట్‌ జోన్స్‌లలో పడుకుంటారు. ఆ జోన్స్‌లో నిద్ర పోవడం వల్ల అనవసర కలలు, ఆలోచనలు వస్తాయి. ఆ రెండు దిక్కుల్లో మంచం లేకుండా చూసుకోవాలి.

వాస్తు శాస్త్రాన్ని Vastu shastra మన దేశంలో చాలా మంది నమ్ముతారు . అందుకే ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా.. ఇతర ఏ శుభకార్యాలు చేసినా.. వాస్తు నియమాలు పాటిస్తారు. కానీ, కొన్ని ఇల్లలో ఎప్పుడూ ఏదో ఇబ్బందులు, చిన్నచిన్న గొడవులు, చికాకుతో ఉండే ఇల్లు నరకం కంటే ఘోరంగా ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో కూడా ఇలా ఉంటే, ఈస్ట్‌ భాగం East part పాడైనట్లు అర్థం. దీంతో బయట వారు లేదా ఇంట్లోవారు ఒకరితో ఇంకొరికి పడదు. తగ్గడం, కట్టింగ్‌ రావడం, చెదలు పెట్టడం, పర్రెలు రావడం కూడా దోషమే. ఆ దిక్కున వేసే రంగులు కూడా ప్రభావితం చేస్తాయి.

ముఖ్యంగా ఈ దిశలో ఎరుపు రంగు ఉండకుండా చూసుకోవాలి. కేవలం ఆకుపచ్చ Green రంగు వేసుకోవాలి. ఈస్ట్‌ సెంటర్‌ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువు ఒక రకమైన ఎనర్జీని క్రియేట్‌ చేస్తుంది. ఆ సెంటర్‌ పాయింట్‌లో శ్రీరామపట్టాభిషేకం పెట్టుకుంటే చాలా మంచిది. దీన్ని కంపాస్‌ పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. అది ఇంటికి లోపలివైపు పెట్టుకోవాలి. కుటుంబ సభ్యుల ఫోటో ఆనందంగా ఉన్న పిక్చర్‌ను బ్యాగ్రౌండ్‌ గ్రీన్‌ పెట్టుకుని ఈశాన్యాని North-east కి తూర్పునకు మధ్యభాగంలో పెట్టుకోవాలి.

ఆ తర్వాత నెమలి ఈకలను పెట్టాలి. దీంతో ఆ ఇంటికి మంచి ఫలితం వస్తుంది. ఇంట్లో సరైన ఆలోచనా విధానం లేకపోతే ఈశాన్యం బాగులేదని అర్థం. ఎందుకంటే ఇది వాస్తు పురుషుడికి తలభాగం అవుతుంది. అందుకే ఈ భాగం గమనిస్తూ ఉండాలి. ఆ పార్ట్‌లో పెచ్చులు లేవకుండా చూడాలి.

ఇది కూడా చదవండి: తిరుమల హుండీలో ఈ ముడుపు వేస్తే.. మంచి ఫలితం వస్తుంది!




ఇంట్లో పెచ్చులు ఎక్కువగా వస్తే.. ఆ ఇంటికి రాహు ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. ముందుగా ఏ సమస్య వచ్చినా 16 డైరెక్షన్లలో ఎక్కడ సమస్య ఉందో.. ఎందువల్ల ఇబ్బందులు వస్తాయో చూసుకోవాలి.
నైరుతి, ఆగ్నేయం భాగంలో పింక్‌ కలర్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ దిక్కున గ్రీన్‌ కలర్‌ లేకుండా చూసుకోవాలి. ఆ రంగు అల్మారా కూడా లేకుండా చూసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఈ రాశుల వారు అబద్ధాలు ఎక్కువగా చెబుతారట.. జాబితాలో మీ రాశి ఉందోమో తెలుసుకోండి


నిద్రపోయేటపుడు కూడా దేవుడి వైపు కాలు పెట్టి పడుకోకూడదు అంటారు. దక్షిణంవైపు తలపెట్టి పడుకోవాలి అంటారు. ఈ దిక్కున ఎందుకు పడుకోవాలి అంటే దక్షిణం వైపు నుంచి కుజ దేవుడి ఎనర్జీ ఫ్లో అవుతుంది. అందుకే నిద్ర పోయినపుడు ఈ దిక్కున తల పెట్టి పడుకోవాలి అంటారు. లేదా తూర్పునకు తల పెట్టి పడుకోవచ్చు కూడా. దీంతో ఎనర్జీగా ఉంటే.. ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

తదుపరి వార్తలు