Home /News /astrology /

KEEP THIS ONE PHOTO IN PUJA ROOM FOR BEST RELATION BETWEEN WIFE AND HUSBAND RNK

Wife and husband relation: భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదా? అయితే, పూజగదిలో ఈ ఒక్క ఫోటోను ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శివపార్వతులు కలిసి ఉండే చిత్రం లేదా అర్థనారీశ్వరుడి చిత్ర పటాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దంపతుల ఐక్యత మెరుగుపడుతుంది.

భార్యాభర్తల (wife and husband)  మధ్య ఐక్యత నెలకొల్పడానికి చేయావలసిన ముఖ్యమైన పని పూజగదిని (puja room) శుభ్రంగా పెట్టుకోవాలి. పూజగది శుభ్రంగా లేని ఇంట్లో దంపతుల మధ్య కచ్చితంగా సామరస్యం ఉండదు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వారానికి ఒక్కసారి అయినా .. పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే దైవ కటాక్షం ఉంటుంది.

దంపతుల మధ్య ఐక్యతకు పూజగదిలో చిత్ర పటాలను దగ్గరగా ఉంచకూడదు అంటారు. ఒక పటానికి ఇంకో చిత్ర పటానికి మధ్య గ్యాప్ ఉండాలి. అంతేకాదు ఈ చిత్రపటాలను పడిపోయినట్లుగా ఉండకూడదు. అలా ఉంటే భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదని శాస్త్రం చెబుతారు.

ఇది కూడా చదవండి: సూర్యగ్రహణం 2021 జాగ్రత్తలు.. గర్భిణీ స్త్రీలు ఈ 4 పనులు చేస్తే ఏమవుతుందో తెలుసా?

అంతేకాదు, స్వామివారి చిత్రపటాలను ఒంటరిగా ఉంచకూడదు అనే శాస్త్రం చెబుతుంది. శివ, పార్వతి చిత్రాలు ఒంటరిగా ఉంచకూడదు. ఈ దంపతులిద్దరూ కలిసి ఉన్న చిత్రపటాలు పెట్టుకోవాలి. అటువంటి ఇంట్లో దంపతుల మధ్య ఏ గొడవలు ఉండవు.

శివపార్వతులు కలిసి ఉండే చిత్రం లేదా అర్థనారీశ్వరుడి చిత్ర పటాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దంపతుల ఐక్యత మెరుగుపడుతుంది. పూజ గదిలో లక్ష్మీ నారాయణ, మహాలక్షి కలిసి ఉండే చిత్ర పటాలు పెట్టుకోవాలి. అష్టలక్ష్మి, సాయి, రాఘవేంద్ర దేవుళ్లను పూజించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి:  శనివారం అమావాస్య.. శనిదోషం కలుగకుండా చేయాల్సని పరిహారాలు..

వేంకటేశ్వర స్వామీ పద్మావతి, అలీవేలు మంగ తాయారు విగ్రహాలను పెట్టుకోవాలి. ఎంతో విలువైన విషయాలు చోటుచేసుకుంటాయి. అలాగే, శనివారం ఒక్క నెయ్యి దీపం పెట్టాలి. ఇంట్లో ఏవైనా గొడవలు ఉంటే పోతాయి.

విద్యకు అధిపతి దేవత సరస్వతి చాలా ముఖ్యమైంది. కానీ, నవగ్రహాలను ఉంచుకుని పూజించకూడదు అనే అభిప్రాయం సాధారణంగా ఉంటుంది. శనివారాలు నవగ్రహాలకు దీపారాధన చేస్తే.. దోష నివారణ జరుగుతుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: SPIRUTUAL

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు