హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vastu: ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు డబుల్‌ అవుతాయి!

Vastu: ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు డబుల్‌ అవుతాయి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ధనం లేని వ్యక్తులను సమాజం కూడా చిన్నచూపు చూస్తుంది. అందుకే అన్నారు ధనం మూలం ఇదం జగత్‌ అని.

మన హిందూ సంప్రదాయం ప్రకారం కుబేరుడి ( Lord kubera) సంపదలకు దేవుడిగా పరిగణిస్తారు. అయితే, కొన్ని సరైన వాస్తు చిట్కలను అనుసరించి సంపదను ఆకర్షింవచ్చు. కుబేరుడు సంతోషించిన ఇంట్లో ఎన్నటికీ ఆర్థిక సమస్యలు (Financial problems) రావు. మీ ఆర్థిక సమస్యలు అధిగమిండానికి కొన్ని వాస్తు చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. నెమలినీ Peacock మన భూమండలంపై ఉండే అందమైన పక్షిగా పేరు. హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవి, సరస్వతి దేవతలతో నెమలికి అవినాభవ సంబంధం ఉంది.

మనం సౌకర్యవంతంగా బతకడానికి డబ్బు(Cash) చాలా ముఖ్యం. డబ్బు లేని ప్రపంచాన్ని ఊహించలేం. మనం విలాసవంతంగా బతకడానికి డబ్బు మాత్రమే ఏకైక మార్గం. అందుకే ఎన్నో కష్టాలు పడతాం. కానీ, కొందరు ఎంత డబ్బు సంపాదించినా నిల్వ ఉండదు. మరికొందరూ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. అటువంటి వారికోసం ఈరోజు ఓ మంచి వాస్తు చిట్కాను తీసుకువచ్చాం.

ఇది కూడా చదవండి: ష్‌..! కర్కాటక రాశివారితో ఈ విషయాలు అస్సలు చెప్పొద్దు!


వాస్తు ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంటికి శుభాలు కలుగుతాయని అంటారు. అయితే, నెమలి విగ్రహం కూడా డ్యాన్స్‌ చేసేది పెట్టుకోవడం వల్ల సంపద, తెలివితేటలు రెండింటినీ ఆకర్షించే గుణం ఉంటుంది.

ఇంట్లో వెండి నెమలి ప్రతిమను పెట్టుకుంటే ఆ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఉదాహరణకు మీ వైవాహిక జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు , సమస్యలు ఉంటే.. లేదా మీ భాగస్వామితో తరచూ గొడవలు జరుగుతున్నట్లయితే.. ఆ ఇంట్లో వెండి నెమలిని పెట్టుకోవడం వల్ల వారి వైవాహిక జీవితం ప్రేమ, శాంతితో సాగుతుంది. అంతేకాదు, అటువంటి ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీకి తావు ఉండదు.

ఇది కూడా చదవండి: సూర్యాస్తమయం తర్వాత ఈ పని చేస్తున్నారా? అష్టదరిద్రంతో..వాస్తు ప్రకారం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఏవరైనా సరే.. వారి ఇంట్లో లేదా కార్యాలయంలో ఆగ్నేయ దిశలో వెండి నెమలిని సురక్షితంగా పెట్టుకోవాలి. దీంతో ఆ ఇంటికి ఎప్పుడూ డబ్బు కొరత ఏర్పడదు.

వెండి నెమలి ప్రతిమను పెట్టుకోవడమే కాదు.. ఇంటి అల్మారా లేదా క్యాష్‌ పెట్టుకునే లాకర్లు నైరుతి లేదా దక్షిణ గోడకు పెట్టుకోవడం ముఖ్యం. అవి తెరచినపుడు వాటి దిశ ఉత్తర దిశలో ఉన్నట్లుగా తీయాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ కుబేరుడి స్థానం. అందుకే ఈ దిశలో పెట్టుకుంటే మీ డబ్బు ఎల్లప్పుడూ తగ్గిపోకుండా కుబేరుడు అనుగ్రహిస్తాడు. కానీ, తప్పుడు మార్గాల్లో ఆర్జించిన డబ్బు ఎప్పుడు నిలవదని గుర్తుంచుకోండి.

Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు