ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల అన్ని భయాలు పోయి.. స్వేచ్ఛ లభిస్తుందని అంటారు.
Kartika month 2021: కార్తీకమాసం శరద్ పూర్ణిమ మరుసటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో విష్ణువు నిద్ర నుంచి మేల్కొని మొత్తం సృష్టిపై ఆనందం, దయను కురిపిస్తాడని నమ్ముతారు.
Kartika month 2021: కార్తీకమాసంలో విష్ణుమూర్తి (lord vishnu) నాలుగు నెలల యోగనిద్ర తర్వాత మేల్కొంటాడు. అంతేకాదు ఈ నెల దాతృత్వానికి కూడా ప్రసిద్ధి. అలాగే పండుగలకు కూడా ప్రత్యేకమైన మాసంగా పరిగణిస్తారు.
కార్తీక మాసం ప్రాముఖ్యత..
హిందు కేలండర్ ప్రకారం అక్టోబర్ 21 (ఈరోజు)న కార్తీక మాసం (Kartika month) గురువారం రోజు ప్రారంభమవుతుంది. ఇది వచ్చే నెల అంటే నవంబర్ 19న శుక్రవారం ముగుస్తుంది. ఈ మాసాన్ని విష్ణుమాసం అని కూడా అంటారు. ఈ మాసాన్ని విష్ణు, లక్ష్మీదేవి( laxmi devi) లకు అంకితం చేస్తారు. ఈ నెలలో నదిస్నానం చేయడం, తులసిని పూజించడం చాలా ప్రత్యేకం.
స్కంద పురాణంలో కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ.. వేదం లాంటి గ్రంథం లేనట్టు.. గంగా లాంటి తీర్థయాత్ర లేదు.. సత్యాగుడిలాంటి శకం కూడా లేదు. అదేవిధంగా కార్తీక మాసం లాంటి వేరే మాసం లేదు.
ఆంగ్ల కేలండర్ ప్రకారం కార్తీకమాసం ఏడాదిలో 11వ నెల. కానీ, దీన్ని హిందూ కేలండర్లో 8వ నెల అంటారు. ఈ నెల శరద్ పూర్ణిమ మరుసటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో విష్ణువు నిద్ర నుంచి మేల్కొని మొత్తం సృష్టిపై ఆనందం, దయను కురిపిస్తాడని నమ్ముతారు. దీంతోపాటు మా లక్ష్మీదేవి కూడా ఈ నెలలో భూమిని సందర్శిస్తుంది. భక్తులకు అపారమైన సంపదను అనుగ్రహిస్తుంది.
కార్తీకమాసంలో తులసి పూజ ఎందుకు చేస్తారు?
తులసి విష్ణువుకు చాలా ప్రియమైంది. ఈ మాసంలో తులసిపూజ చేస్తే.. అనేక రెట్ల పుణ్యం లభిస్తుంది. అందుకే ఈ మాసం తులసిమాతకు కూడా ప్రత్యేకం. బ్రహ్మ ముహూర్తంలో ఈ మాసంలో స్నానం చేసి, తులసి పూజ చేయడం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈరోజుల్లో ప్రజలు ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసిమాతను అలంకరించి పూజలు చేస్తారు. ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల అన్ని భయాలు పోయి.. స్వేచ్ఛ లభిస్తుందని అంటారు.
ఇక కార్తీక మాసంలో గోపూజ, ధంతేరస్, దీపావళి వంటి పండుగలు ఉన్నాయి. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. చతుర్మాసాలు ముగిసిన ఈ రోజు విష్ణువు మేల్కొంటాడు. ఈ రోజు తులసిని వివాహం చేసుకుంటాడు. శుభకార్యాలు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.