హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

హిందూ సంప్రదాయాల్లో చిన్నారులకు గుండు ఎందుకు చేయిస్తారో తెలుసా? మూఢనమ్మకం కాదు

హిందూ సంప్రదాయాల్లో చిన్నారులకు గుండు ఎందుకు చేయిస్తారో తెలుసా? మూఢనమ్మకం కాదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాల్లో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. మరి చిన్నారులకు ఎందుకు గుండు కొట్టిస్తారో తెలుసా? ఇది మూఢనమ్మకమా?

భారతదేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి మతానికి వేర్వేరు నియమ నిబంధనలు ఉన్నాయి. పిల్లల పుట్టుక నుంచి వివాహం, మరణానంతర అంత్యక్రియల వరకు.. ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు. హిందువులు కూడా అనేక ఆచార వ్యవహారాలను అనుసరిస్తారు. హిందువుల ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు.. కొంతకాలం తర్వాత ఆ బిడ్డకు గుండు కొట్టించడాన్ని మనం చూస్తుంటాం. పిల్లలు పుట్టిన 6 నెలలు లేదంటే 9 నెలలకు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి గుండు చేయిస్తారు. దీనిని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. చిన్నారి మేనమామ మొదట కొంత జుట్టును కత్తిరిస్తారు. అనంతరం వారికి పూర్తిగా గుండు చేయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాల్లో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. మరి చిన్నారులకు ఎందుకు గుండు కొట్టిస్తారో తెలుసా? ఇది మూఢనమ్మకమా?

ఈ రెండు రాశుల వారికి గుడ్ న్యూస్.. జులై నుంచి మంచి రోజులు.. మీరున్నారేమో చూసుకోండి

చాలా మంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. దేవుడి సమక్షంలో పిల్లలకు గుండు చేయిస్తుంటారు. ఇలా చేస్తే తమ బిడ్డ భవిష్యత్ బాగుటుందని.. విశ్వసిస్తారు. దేవుడి ఆశీర్వాదం తమ చిన్నారిపై ఉంటుందని నమ్ముతారు. ఐతే కొంత మంది మాత్రం ఇది మూఢనమ్మకమని కొట్టి పారేస్తుంటారు. ఒట్టి బూటకమని భావిస్తారు. కానీ చిన్నపిల్లలకు గుండు చేయించడం వెనుక సైన్స్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. దీనిని శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే.. పిల్లలకి తల వెంట్రుకలు తీయడం చాలా ముఖ్యమైన విషయం. అందుకు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉన్న బిడ్డ ఈ లోకానికి వచ్చాక.. వారి తలపై చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి. తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా వాటిని తొలగించలేం. షాంపూతో తలంటు స్నానం చేయించినా సూక్ష్మక్రిములు వెళ్లిపోవు. అందుకే పిల్లలకు గుండు చేయిస్తారు. ఇది తలపై ఉన్న సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను పూర్తి స్థాయిలో తొలగిస్తుంది.

పిల్లల్లో శిరోముండనం చేస్తే.. వారి శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రణలో ఉంటుంది. పిల్లలకు గుండు చేయిస్తే.. కురుపులు, మొటిమలు, విరేచనాలు వంటి వ్యాధులు దూరమవుతాయి. తల కూడా చల్లబడుతుంది.

హిందూ సంప్రదాయాల్లో చిన్నారులకు గుండు ఎందుకు చేయిస్తారో తెలుసా? మూఢనమ్మకం కాదు

గుండు చేసినప్పుడు.. పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నింటినీ తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా అతని తల భాగంలోని చర్మంపై పడుతుంది. ఈ సూర్యరశ్మి మంచి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిరల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

చిన్నపిల్లలకు గుండు చేయించడం వల్ల పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయని శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది. అందుకే హిందువుల ఆచారాల ప్రకారం.. చిన్నపిల్లలకు గుండు చేయిచండం.. మూఢనమ్మకం కాదని.. సైన్స్ అని.. చాలా మంది పండితులు చెబుతారు.

First published:

Tags: Hindu festivals, Life Style

ఉత్తమ కథలు