నవరాత్రుల్లో Navaratri దుర్గాష్టమి రోజు చాముండ దేవి చండా–ముండా రాక్షసులను సంహరించిందని నమ్ముతారు. అయితే, అది ఎక్కడో చాలా మందికి తెలియదు. దుర్గామాత 51 శక్తిపీఠాల్లో Shakti peeth ఇది ఒకటి అని పరిగణిస్తారు. ఈ నవరాత్రుల సమయంలో భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి.. అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మవారి 51 శక్తిపీఠాలను దర్శించుకోవడానికి వందలాది మంది భక్తులు కోరుకుంటారు. అటువంటిదే.. హిమాచల్ ప్రదేశ్ Himachal pradesh లోని అమ్మవారి శక్తిపీఠం. దీన్ని దైవభూమి అని కూడా అంటారు. భక్తులకు అత్యంత విశ్వాసం కలిగిన శక్తిపీఠం ఇది.
మా చాముండ ఆలయం భక్తులతోపాటు టూరిస్టులను కూడా ఆకర్షిస్తుంది.
ఈ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్, కాంగ్రా జిల్లాలో ఉంది. ఇక్కడి వచ్చే భక్తులను.. తల్లి చాముండి అనుగ్రహించి వారు కోరిన కోర్కెలను తీరుస్తుందని నమ్ముతారు. ఇక్కడ ప్రయాణికులు ఎక్కువ రోజులు ఇక్కడే ఉండి, తమ ప్రయాణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు.
చండా–ముండా రాక్షసుల సంహరం..
పురాణాల ప్రకారం చాండా–ముండా అనే ఇద్దరు రాక్షసులు ఈ ప్రదేశంలోనే మా దుర్గాతో పోరాడారు. ఈ సమయంలో దుర్గామాత నల్లని రూపాన్ని ధరించి, ఆ రాక్షసులను వధించింది. తల్లి అంబిక నుంచి ఉద్భవించిన కాళీ మాతకు ఈ చండా–ముండాల తలలను బహుమతిగా సమర్పించింది. దీంతో ఆమె చాముండి పేరుతో ప్రపంచమంతా ప్రసిద్ధి చెందేలా వరం ఇచ్చింది.
ఆలయ చరిత్ర..
చాముండి దేవి ఆలయం గురించి ఒక కథ ఉంది. 400 ఏళ్ల కిందట అప్పటి రాజు, పూజారి ఆలయాన్ని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించినపుడు పూజారి కలలోకి వచ్చిన మాత వేరే ప్రదేశానికి మార్చడానికి, తవ్వకాలు జరపడానికి అనుమతించి, ఒక స్థలాన్ని నిర్ధేంషిందట. తల్లి చెప్పిన ప్రదేశంలోనే తల్లి చాముండ విగ్రహం బయటకు వచ్చి ఉంది. ఆ తర్వాత విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి అదే స్థలంలో పూజలు చేస్తూ వచ్చారు.
దీనికి ముందు రాజు విగ్రహాన్ని తీయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఎంత మంది ప్రయత్నించినా.. విగ్రహాన్ని బయటకు తీయలేకపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Durga Pooja, Dussehra 2021, Himachal Pradesh, Navaratri