Vaikunta Ekadasi 2020: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత.. మోక్ష మార్గం కోసం ఆచరించాల్సిన ఏడు ముఖ్యమైన నియమాలు...

వైకుంఠ ఏకాదశి Photo : Twitter

Vaikunta Ekadasi 2020: మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కథనం..

 • Share this:
  మోక్ష మార్గం ఉత్తర ద్వారం..మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది.వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమ నిష్ఠలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా, ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పూజాదికారాలు జరిపితే.. ఆ ఏడాదంత మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తూ స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా, ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ , నియమ నిష్ఠలతో పూజాదికారాలు చేసి, తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో, ఒకే విధమైన పూజాదికారాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం.

  సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుని ఉంటాయని భక్తు భావిస్తారు. ఆ రోజున వైష్ణవ యాగంలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచి వేచి ఉంటారు. ఆ ద్వారం గుండా చూస్తే సాక్షాత్తూ మహావిష్ణువు దర్శనం జరుగుతుందని, మోక్షం ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంలో విహరిస్తూ, మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగివచ్చి, భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు. అందుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులకు సమానమని భావిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, పరమ శివుడు హాలాహలాన్ని మింగాడని కూడా పురాణాలు చెబుతున్నాయి.

  సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి మహావిష్ణువును దర్శనం చేసుకుంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, జపం, ధ్యానం, ఉపావాసం తదితర సాధనల ద్వారా ఆ రోజున మనసును విష్ణువుపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలు ఉన్నాయి. ఒకటి దశమి నాడు టిత్రి నింహారులై ఉండాలి. రెండు, ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి. మూడు, అబద్ధం ఆడకూడదు. నాలుగు, స్త్రీ సాంగత్యం పనికిరాదు. అయిదు, చెడ్డ పను, చెడు ఆలోచను
  చేయకూడదు. ఆరు, ఏకాదశి రోజున రాత్రంత జాగరణ చేయాలి. ఏడు, అన్నదానం చేయాలి.

  ప్రధాన కథనం

  ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని భక్తి ప్రపత్తుతో ఆచరించాడట. నరకం బాధను అనుభవిస్తున్న అతని పితృ దేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట. మురా సురుడు కథ రెండవది. కృత యుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను విపరీతంగా బాధించేవాడు. దేవతలు విష్ణువుకు మొర పెట్టుకున్నారు. విష్ణువు మురా సురుడి మీద దండెత్తాడు. కానీ, మురా సురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురా సురుడిని బయటకు రప్పించే ఉపాయాన్ని ఆలోచించడానికి విష్ణువు ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్ర పోతున్నాడని భావించిన మురాసురుడు విష్ణువును వధించడానికి బయటికి వచ్చాడు. విష్ణువు వద్దకు వచ్చి కత్తి ఎత్తాడు. మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై, మురా సురుడిని సంహరించింది. విష్ణువు లేచి, ఆమెను మెచ్చుకుని, ఆమెకు ‘ఏకాదశి’ అనే బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది.

  ఇందులో ఒక తాత్విక సందేశం ఇమిడి ఉంది. విష్ణువు ఉండే గుహ మరెక్కడో లేదు. హృదయ స్థానమే ఆయన గుహ. దేహమే దేవాలయమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ప్రతి మానవ హృదయం లోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరగా ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, పూజ, జపం, ధ్యానం ద్వారా ఆరాధించమని భావం. మానవులు తమ ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తారు. అవే అజ్ఞాన నికి మూలం. ఆ ఇంద్రియాలకు ప్రతినిధి మురా సురుడు. అజ్ఞానానికి కూడా అతను ప్రతినిధి. అతన్ని జ్ఞాన ప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులు అవుతారని, మోక్షాన్ని సాధిస్తారని చెబుతారు. భారతీయులు పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం ఇదే.
  Published by:Suresh Rachamalla
  First published: