Home /News /astrology /

Skandha sashti 2021: సుబ్రహ్మణ్య షష్ఠి .. ఈరోజు సాయంత్రం ఒక్క పని చేస్తే.. విశేషయోగాలు..

Skandha sashti 2021: సుబ్రహ్మణ్య షష్ఠి .. ఈరోజు సాయంత్రం ఒక్క పని చేస్తే.. విశేషయోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాయసం నివేధించాలి. ఇలా చేస్తే కుజదోషం పోతుంది. ఈయనకు ఇష్టమైన నైవేద్యం పొంగాలి, చలివిడి, వడపప్పు, అరటిపండు.

దేవతల కోరిక మేరకు పరమశివుడి (Lord shiva) అంశంతో మార్గశిర షష్టినాడు జన్మించాడు కుమార స్వామి. ఈరోజు అంటే 9వ తేదీ గురువారం 2021 నిర్వహించనున్నారు. దీన్నే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంధ షష్టి (skandha sashti) అని పేరు. సుబ్రహ్మణ్య స్వామికి కుమార స్వామి, షణ్ముకుడు, స్కంధుడు, కార్తీకేయుడు, వేళాయదుడు, శరవణుడు,మురుగన్ అనే పేర్లు కలవు. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిగా చేశారు. కుమారస్వామి తారకాసురుడితో 6 రోజులపాటు పోరాడి అతడి సంహారించి దేవతల మన్ననలు పొందుతాడు. భక్తులు ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానమాచరించి పాలు, పంచదారను నైవేద్యాన్న స్వామివారికి సమర్పిస్తారు. సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీవల్లీ, దేవసేనాల సమేతంగా స్వామివారి కల్యాణాన్ని దేవాలయాల్లో నిర్వహిస్తారు. ఈ వివాహాం చూసిన యువతీయువకులు వీక్షిస్తే.. ఏ ఆటంకాలు లేకుండా కల్యాణం జరుగుతుందని అంటారు.

ఇది కూడా చదవండి: డిసెంబర్లో పుట్టినవారు చురుగ్గా ఉంటారు.. కానీ, ఈ ఒక్క విషయంలో..


సుబ్రహ్మణ్య షష్టి తిథి మార్గశిర శుక్ల షష్టి 2021 గురువారం 9.
సమయం 8 సాయంత్రం 9.26 ప్రారంభమై 9న రాత్రి 7.54కు ముగుస్తుంది.

ఈరోజు ముక్యంగా నదీ స్నానమాచరిస్తారు. ఆవుపాలు నైవేద్యంగా పెట్టాలి. సుబ్రహ్మణ్య అష్టకం పటించాలి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి వీలైనంత దానధర్మాలు చేయాలి. విశేషించి ఈరోజు సుబ్రహ్మణ్యశ్వేర స్వామికి కావడి సమర్పిస్తే వారి వంశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు స్వామివారి కల్యాణం జరిపించిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా ఈ మొక్కను మీ ఇంటి పరిసరాల్లో పెంచకండి.. ఇబ్బందులు..


కొంతమంది ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. ఇలా చేస్తే నాగదోషాలు పోతాయి. స్తిమితం, బుద్ది కుశలత పెరుగుతుంది. సాధన చేసే లక్షణం అలవడుతుంది. తెల్లటి పూలతో, పాలు, పాయసం స్వామివారికి నివేధించాలి. ఇలా చేస్తే కుజదోషం పోతుంది. ఈయనకు ఇష్టమైన నైవేద్యం పొంగాలి, చలివిడి, వడపప్పు, అరటిపండు. జంటనాగులకు పాలు, పంచామృతాలతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ సమర్పించాలి. ఎర్రటిపుష్పలు సమర్పిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి. పెళ్లికాని వారికి , పిల్లలు లేనివారికి విశేష యోగాలు కలుగుతాయి.
Published by:Renuka Godugu
First published:

తదుపరి వార్తలు