హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: (జనవరి 27) మీ పేరు O, P తో మొదలవుతుందా? ద్వేషం ఉండని వ్యక్తిత్వం మీ సొంతం

Numerology: (జనవరి 27) మీ పేరు O, P తో మొదలవుతుందా? ద్వేషం ఉండని వ్యక్తిత్వం మీ సొంతం

Numerology

Numerology

Numerology Today:(పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) ఇంగ్లీష్ లెటర్‌ Oతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సెల్ఫ్‌ సెంటర్డ్‌గా బోల్డ్‌గా ఉంటారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, కానీ చివరి వరకు వదిలిపెట్టరు. ఈ వ్యక్తిత్వం వారిని తక్కువ స్థాయి నుంచి ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam

Numerology:పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్‌ సెలక్ట్‌ చేసుకుని పేరు పెడితే మేలు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని వివరించారు. ఇప్పుడు ఆల్ఫాబెట్‌ O, Pతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

ఆల్ఫాబెట్ "O":

ఇంగ్లీష్ లెటర్‌ Oతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సెల్ఫ్‌ సెంటర్డ్‌గా బోల్డ్‌గా ఉంటారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, కానీ చివరి వరకు వదిలిపెట్టరు. ఈ వ్యక్తిత్వం వారిని తక్కువ స్థాయి నుంచి ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు, పెద్ద సంఖ్యలో స్నేహితులను అలాగే శత్రువులను పొందుతారు. జీవితంలోని మోసాలతో చాలా నష్టపోతారు, కానీ చాలా పాఠాలు నేర్చుకుంటారు. తెలివిగల మనస్తత్వం పొందుతారు.

సమస్యలను పరిష్కరించడానికి ప్రాక్టికల్‌ అప్రోచ్‌ అనేది, వీరి జీవితానికి ఆస్తి. ఆశయాలు వారిని గొప్పతనానికి పురికొల్పుతాయి, సంపన్నులుగా చేస్తాయి. సంపద జీవితంలో కొంచెం ఆలస్యంగా వస్తుంది. O లెటర్‌ మనస్సులో అనంతమైన ఆలోచనలను ప్రసరింపజేస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా అశాంతిని కలిగిస్తుంది. అందుకే వీరు ధ్యానం చేయడం మంచిది.

లక్కీ కలర్స్‌: స్కై బ్లూ, వైట్‌

పరిహారం: మీతో ఇప్పుడూ వైట్‌ హ్యాండ్‌ కట్చీఫ్‌ ఉంచుకోండి

ఆల్ఫాబెట్‌ P :

ఆల్ఫాబెట్ Pతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు జీవితంలో అపారమైన చికాకు, అనిశ్చితి ఉన్నా బయటకు ప్రశాంతంగా ఉంటారు. చాలా గొప్పవారు, ఆనందాన్ని ఇవ్వగల అపారమైన సామర్థ్యం ఉంటుంది. ఎవరి పట్ల ద్వేషం ఉండదు. స్వచ్ఛమైన ఆలోచనలు, పనులు కలిగి ఉంటారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ విచారంగా కనిపించరు. వ్యక్తిగతంగా కోల్పోయిన సమయంలో కూడా స్నేహితులకు సహాయం చేస్తారు. ప్రశాంతమైన పరిసరాల్లో ఉండటానికి ఇష్టపడతారు.

వీరు దేవుణ్ణి బలంగా నమ్ముతారు, అన్ని ఆచారాలను పాటిస్తారు. సంపన్నులుగా, తృప్తిగా జనాదరణ పొందినవారు, అదృష్టవంతులు, స్థిరంగా, సంపన్నులుగా ఉంటారు. వారి పాజిటివ్‌ పవర్‌ ఇతరులను ప్రభావితం చేయగలుగుతుంది. ఆకర్షణీయంగా ఉంటారు. Pతో పేరు మొదలయ్యే స్త్రీలు, జీవిత భాగస్వాములకు ప్రత్యేకంగా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వారి అదృష్టం మరింత పెరుగుతుంది. సౌందర్య సాధనాలు, లగ్జరీ వస్తువుల వ్యాపారం చేసే మహిళలు బిజినెసకు P లెటర్‌తో మొదలయ్యే పేరు పెట్టాలి. వ్యాపారం మంచి ఫలితాలను అందిస్తుంది.

లక్కీ కలర్స్‌: ఎల్లో, పింక్‌

పరిహారం: శివుడికి పాలతో అభిషేకం చేయండి.

Shukra Gochar: శుక్రుడి సంచారం.. లక్ష్మీదేవి అశీస్సులు.. ఈ 4 రాశుల వారికి కలిసొచ్చే కాలం

ఆర్టిఫికల్ ఆభరణాలకు బదులుగా వెండి, బంగారం లేదా డైమండ్‌ ధరించండి. కలశంలో నీటిని పోసి, ఇంటి ఈశాన్య ప్రాంతంలో ఉంచండి. పశువులు లేదా పేదలకు పాలు దానం చేయండి. దయచేసి నాన్ వెజ్, లిక్కర్, పొగాకు, లెదర్‌ ప్రొడక్టులకు దూరంగా ఉండండి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు