Home /News /astrology /

IF YOU WEAR THESE FIVE GEMS YOU WILL OVERCOME FINANCIAL PROBLEMS CLICK HERE FOR FULL DETAILS PRV GH

Financial Issues resolving Ratnas: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా?.. ఈ ఐదు రత్నాలు ధరిస్తే మీ చేతి నిండా డబ్బే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంత కష్టపడి పనిచేసినా కొందరి చేతిలో చిల్లగవ్వ నిలవదు. రోజు వారీ ఖర్చులకు కూడా కటకటలాడిపోతుంటారు. ఎంత కష్టపడినా ఆర్థికంగా మాత్రం అడుగు ముందుకు పడదు. ఎలాంటి అప్పులు లేకుండా, జీవితంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

ఇంకా చదవండి ...
ఎంత కష్టపడి పనిచేసినా కొందరి చేతిలో చిల్లగవ్వ నిలవదు. రోజు వారీ ఖర్చులకు కూడా కటకటలాడిపోతుంటారు. ఎంత కష్టపడినా ఆర్థికంగా (Financial) మాత్రం అడుగు ముందుకు పడదు. ఎలాంటి అప్పులు (debt) లేకుండా, జీవితంలో ఆర్థిక సమస్యలు (Financial problems) రాకుండా ఉండాలని  ప్రతి ఒక్కరు కోరుకుంటారు. డబ్బుకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని పూజలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం రానివారి కోసం రత్న శాస్త్రం (Gemology)లో అనేక పరిష్కారాలు సూచించారు. రత్నాలను ధరించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. అయితే ఎవరు ఎలాంటి రత్నాలు (Gems) ధరించాలనేది రత్నశాస్త్రంలో స్పష్టంగా వివరించారు. ఎలాంటి ఆర్థిక సమస్యలకు ఏ రంగు రాయి ధరించాలి, వ్యాపారాభివృద్ధికి ఏ రాయి ధరించాలో రత్న శాస్త్రం ద్వారా తెలుస్తోంది. రత్న శాస్త్రంలో ఆర్థికంగా పుంజుకునేందుకు దోహదపడే అనేక రత్నాలు, వాటి ఫలితాలు వివరించారు. ఆ వివరాలు మీకోసం ...

1. బంగారు రత్న
రత్నశాస్త్రం (Gemology) ప్రకారం తీవ్ర ఆర్థిక నష్టాలు, ఆర్థిక సంక్షోభం ఉన్న వారు బంగారు రత్న(Gold gem) ధరించాలి. ఇది విధిని మారుస్తుందని రత్న శాస్త్రం చెబుతోంది. ఎంత కష్టపడినా డబ్బు నిలవని వ్యక్తులు కూడా దీన్ని ధరించాలని శాస్త్రం చెబుతోంది.

2. పచ్చలు ( ఎమరాల్డ్ )
మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు, ఆర్థిక సహాయం (Financial help) కోసం ఎదురు చూస్తున్న వారు ఆకుపచ్చ రంగు రాయి (Green colored stone) ధరించాలి. దీనివల్ల వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వృద్ధికి కూడా ఇది ఉత్తమమైనది.

3.టైగర్ రత్న
రత్న శాస్త్రంలో టైగర్ రత్నం (Tiger Ratnam) అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇది తక్షణమే ఫలితాన్నిస్తుంది. అందుకే ఈ రత్నాన్ని టైగర్ రత్న అంటారు. ఈ రత్నం వల్ల అంతరాయం కలుగుతున్న పనులన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి.

4.మచ్చిక్ రత్న (Machchik Ratna)
ఇది సల్ఫర్ తో తయారైన ఖనిజం. ఈ రత్నం డబ్బు సంపాదించడానికి మార్గాలను చూపిస్తుంది. ఇది గాజులా, అద్దంలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కూడా ఈ రత్నం సహాయపడుతుంది.

5.గ్రీన్ అవెన్సురిన్ (Green Aventurine)
రత్న శాస్త్రం ప్రకారం ఈ రాయిని వ్యాపారవేత్తలు, ట్రేడర్లు ధరించాలి. ఈ రత్నం సంపదను ఆకర్షిస్తుంది. సంపాదనకు కొత్త మార్గాలను కల్పిస్తుందని రత్న శాస్తం వివరిస్తోంది.

జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం రాశిచక్రాలను బట్టి రత్నాలను ధరిస్తూ ఉంటారు. గ్రహాలను శాంతిపజేయడం కోసం రత్నాలను ధరిస్తూ ఉంటారు. కొన్ని రత్నాల ద్వారా మనసు ప్రశాతంగా ఉంటుందని రత్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆయా గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడంలోనూ రత్నాలు ఉపకరిస్తాయి. అయితే ఎవరు ఏ రత్నం ధరించాలనేది మాత్రం వాస్తు నిపుణుల సూచనల మేరకే ధరించాల్సి ఉంటుంది. లేదంటే ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Astrology, Financial problem, Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు