Vastu: సాధారణంగా ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటాం. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అంటారు. ఏ ఇల్లు అయితే, శుచిగా శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్షీదేవి (laxmi devi) కొలువై ఉంటుందని అంటారు. దీనివల్ల ఇంట్లోనివారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఏ ఇబ్బందులు రాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిసివస్తాయి.
ఇల్లు ఇలా ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే.. ఇంట్లో ఈ 6 రకాల దేవుడి ఫోటోలు ఉండాలి అని వాస్తు నిపుణులు అంటున్నారు. వాటిని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే పెట్టుకుంటే .. నెగెటివ్ ఎనర్జీ (negative energy) బయటకు వెళ్లి.. పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. ఆ ఆరు రకాలు వస్తువులేంటో తెలుసుకుందాం.
పంచముఖ ఆంజనేయస్వామి.. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుందట. ముఖ్యంగా నిలుచుని ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోవాలి. ప్రత్యేక పూజగది ఉంటేనే పెట్టుకోవాలి. కుదరకపోతే కనీసం ఇంటి ప్రధాన ద్వారానికి పెట్టుకోవాలి. ఎటువంటి చెడు దృష్టి ఆ ఇంటిపై పడదని జోతిషులు అంటున్నారు.
ప్రతి మంగళవారం ఈ ఫోటోకు సింధూరం పెట్టి పూజ చేస్తే ఇక ఆ ఇంటిని అదృష్టం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందట. పాపాలను హరించి చిత్తశుద్ధిని కలిగిస్తాడు. తూర్పునకు అభిముఖంగా ఉంటే మంచిది. ఇక నరసింహుడు ఉత్తర ముఖంగా ఉంటే శత్రు బాధలు తొలగిపోతాయి. లక్షీవరాహమూర్తి ఉత్తరముఖంగా ఉంటే.. గ్రహ దోషాల నుంచి తప్పించుకోవచ్చు. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
మహావీర గరుడస్వామి ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల పడమర ముఖంగా పెట్టుకోవడం వల్ల దుష్ట ప్రభావాలు తొలగి.. శరీరంలో ఉండే విషపదార్థాలనుంచి రక్షిస్తాడు. ఊర్థ్వంగా ఉండే హయగ్రీవ స్వామిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జ్ఞానాన్ని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఆరు దేవుళ్ల ఫోటోలను పెట్టుకోవడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నిర్ధేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vastu Tips