Home /News /astrology /

IF YOU FOUND HAIR IN FOOD INDICATION FOR SOME TROUBLES IN FUTURE NGS

Hair in Food: మీరు తింటున్న ఆహారంలో జుట్టు తరుచుగా కనిపిస్తోందా..? అయితే ఈ నష్టాలు తప్పకపోవచ్చు

ఆహారంలో వెంట్రుకలు వస్తున్నాయా? అయితే కష్టాలు తప్పవు

ఆహారంలో వెంట్రుకలు వస్తున్నాయా? అయితే కష్టాలు తప్పవు

Hair in Food: సాధారణంగా చాలామందికి అహారం తీసుకున్నప్పుడు అందులో జుట్టు కనిపిస్తుంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఆడావాళ్లపై విరుచుకుపడతారు కొందరు.. మరికొందరు పక్కకు తీసి పడేసి తినేస్తారు.. అయితే తరచుగా ఆహారంలో జుట్టు వస్తోంది అంటే.. అది చెడు సంకేతాలు ఇస్తోందని అర్థం.. ఏం జరుగుతుందో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Hair in Food: సాధారణంగా మనకు తెలియకుండా త్వరలో ఏం జరగబోతోంది అనే సంకేతాలు అందుతూ ఉంటాయి. అయితే వాటిని చాలామంది గుర్తించలేరు.. ఏదో పొరపాటున జరిగింది లే అని లైట్ తీసుకుంటారు.. అయితే ఈ రోజుల్లోనూ చాలామంది శుకన శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు.. ఏదైనా ఘటన జరిగితే.. ఏదో సంకేతాలు ఇస్తోంది అని మదన పడుతుంటారు. నిత్యం జరిగేదానికి భిన్నంగా ఏదైనా జరిగితే ఏదో కీడు శంకిస్తోందని ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఈ రోజుల్లోనూ చాలామంది ఇప్పటికే శకున శాస్త్రం నమ్ముతూ ఉంటారు.. కొంతమంది సరైన ఎదురు రాకపోతే.. ఏదో ప్రమాదం జరగబోతోందని.. అనుకోని ఆపద వస్తుందని భయపడుతుంటారు. అందుకే మంచి ఎదురు చూసుకుని ఇంటి నుంచి బయలుదేరుతారు. మరికొందరు ఏదైనా అనుకోని మార్పు కనిపిస్తే.. దీంతో ఎలాంటి ఫలితాలు ఉంటాయో అని మదనపడుతుంటారు. ముఖ్యంగా శకున శాస్త్రంలో కొన్ని సంఘటనలకు సంబంధించిన క్లుప్తంగా వివరించారు. ప్రతి మనిషి దైనందిన జీవితంలో చెడు శకునాలు చాలా జరుగుతూనే ఉంటాయి. ఇవి భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని శకున శాస్త్రం పేర్కొంది. కొన్ని కారణాల వల్ల ఈ శకునాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సంఘటనలను పట్టించుకోని వారు అధిక మొత్తంలో నష్టపోతున్నారని శకున శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విషయాన్ని ముందే గ్రహించిన సరైన శ్రద్ధ పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
    ఇలా జరిగితే మంచిది కాదు:

    అలాంటి శకునాల్లో ఒకటి ఆహారంలో వెంట్రుకలు రావడం. అయితే ఈ సమస్య చాలామందికి ఎదురవుతూనే ఉంటుంది. ఎక్కవ శాతం మహిళలే వంటలు వండుతారు. అలాంటి సమయంలో వారి వెంట్రుకలు ఆహారం పడే అవకాశం ఉంటుంది. అది తిన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆహారంలో అలా వెంట్రుక వస్తే చాలామంది విసుక్కుంటారు. అయితే అప్పడప్పుడూ ఇలా జరగడం సహజమే అయినా.. తరచుగా ఇలా మీరు తింటున్న ఆహారంలో వెంట్రుకలు వస్తున్నాయంటే.. దానిని విస్మరించవద్దని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. కానీ ఆహారంలో తరచుగా జుట్టు వస్తే అది ఇంటి నాశనానికి దారి తీస్తుందని శాస్త్రం చెబుతోంది.

    ఇదీ చదవండి : త్వరలో ఈ నాలుగు రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం.. మీ రాశి కూడా ఉందా?

    మీరు తీసుకునే ఆహారంలో తరచుగా జుట్టు రావడం ఓ చెడు శకునమని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకండా జరిగితే డబ్బు నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సంక్షోభం, నష్టానికి సంకేతాలని శకున శాస్త్రం పేర్కొంది. ఆహారంలో వెంట్రుకలు వస్తే..ఆ ఆహారాన్ని తినకూడదని.. ఆహారాన్ని ఆవుకు లేదా ఏదైనా జంతువుకు తినిపించాలని శాస్త్రం తెలిపింది. లేదా అలాంటి అలాంటి ఆహారం తినడం వల్ల పేదరికం వస్తుందని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఆహారంలో జుట్టు రావడం అశుభమని శకునంగానే భావిస్తారు. అలాగే తరచుగా ఇలాంటి సంఘటన జరిగితే చెడు రాహువుకు సంకేతమని తెలిపింది. దీని ద్వారా అనేక రకాల నష్టాలను కలుగొచ్చని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతిని దెబ్బతీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చేతిలో ఉండనివ్వదని శకున శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలా జరుతుంటే ముందే గుర్తించి పండితులను కలిసి.. నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Astrology, Horoscope, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు