హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vastu tips| Astrology: రాత్రి వేళ ఈ పనులు చేస్తే లక్ష్మీదేవీ కటాక్షిస్తుందట.. ఆర్థిక చిక్కులు తొలుగుతాయట

Vastu tips| Astrology: రాత్రి వేళ ఈ పనులు చేస్తే లక్ష్మీదేవీ కటాక్షిస్తుందట.. ఆర్థిక చిక్కులు తొలుగుతాయట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొందరికి ఎంత కష్టపడినా ఆ లక్ష్మీ కటాక్షం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారు ఇంట్లోని వాస్తు దోషాలను తగ్గించుకోవాలట. అందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయడం వల్ల.. వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. లక్ష్మీ కాటాక్షం పొందుతారట. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కొందరు లక్షలు సంపాదించినా చేతిలో డబ్బు (Money) నిలవదు. మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తుంటారు. ఇదంతా వారి ఆర్థిక ప్రాధాన్యతలను బట్టి ఉంటుంది.  అయితే, మన ఇంటి వాస్తు, జ్యోతిష్యం (Astrology) ప్రకారం రాశులు (Zodiac Signs) కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తాయట. డబ్బు, అభివృద్ధి సాధించడం కోసం ప్రజలు రాత్రి పగళ్లు కష్టపడుతూ ఉంటారు. అయితే.. కొందరికి ఎంత కష్టపడినా ఆ లక్ష్మీ కటాక్షం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారు ఇంట్లోని వాస్తు దోషాలను తగ్గించుకోవాలట. అందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయడం వల్ల.. వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. లక్ష్మీ కాటాక్షం (Lakshmi Blessings) పొందుతారట.  లక్ష్మి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలంటే, రాత్రి పడుకునే ముందు (Before Sleep) ఈ వాస్తు చిట్కాలను (Vastu tips) ప్రయత్నించాలి...

  వాస్తు శాస్త్రంలో.. ఇంట్లోని ప్రతి మూలను చాలా ముఖ్యమైంది. అటువంటి పరిస్థితిలో, పడుకునే ముందు వంటగది (Kitchen), స్నానాల గది , ఇంట్లోని ఇతర భాగాలకు సంబంధించిన కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగించవచ్చు. రాత్రి పడుకునే ముందు మీ పడకగదిలో కర్పూరం వెలిగించాలి . ఇలా చేయడం వల్ల పడకగది వాతావరణం స్వచ్ఛంగా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందట. దీంతో లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందట.

  రాత్రి పడుకునే ముందు (Before going to bed) వంటగదిలోని పాత్రలన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో లక్ష్మి సంతోషిస్తుందట. పాత్రలను కడగకుండా వదిలేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఇంటిని నింపుతుంది. మురికి పాత్రలు ఆర్థిక సమస్యలను తెస్తాయట. అందుకే రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మి ఇంట్లో ఎప్పుడూ ఉంటుందట.

  Ganesh Laddu: బాలాపూర్​ లడ్డు రికార్డు బద్దలు.. వేలం పాటలో రూ.46 లక్షలు పలికిన ఆ ఏరియా వినాయకుడి లడ్డూ..

  దానం చేయడం మంచిది. కానీ, సాయంత్రం పూట ఎప్పుడూ దానధర్మాలు చేయకండి, అది పేదరికాన్ని తెస్తుందట. అలాగే పాలు, పెరుగు, ఉప్పు రాత్రి సమయంలో అస్సలు ఎవరికీ ఇవ్వకూడదట. అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం ఎదురుగా చెప్పులు తీసేయండి. అలాగే ఇంటి మెయిన్‌ డోర్‌ను కూడా శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఇల్లు అభివృద్ధి చెందుతుందట.

  రాత్రి పడుకునే ముందు కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి దేవతను లేదా మీ ఇష్టదేవతను స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మనసుకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి నిద్ర వస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం.. బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉంచకూడదట. రాత్రి పడుకునే ముందు బాత్‌రూమ్‌లో బకెట్ నిండుగా ఉంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. బాత్ బకెట్‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దట.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Astrology, Vastu Tips

  ఉత్తమ కథలు