Home /News /astrology /

IF WOMEN OF EVERY FOLLOW THESE VASTU TIPS THAT HOUSE BLESSED WITH LORD LAKSHMI DEVI RNK

Vastu: మహిళలు ఈ పనిచేస్తే.. ఆ ఇల్లు లక్ష్మీనివాసమే!


ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని అనర్థాలు వాస్తు దోషాల వల్ల కలిగితే.. మరి కొన్ని మనం తెలియక చేసే తప్పుల వల్ల జరుగుతాయి. అలా కాకుండా కొన్ని వాస్తు నియమాలు అనుసరిస్తే.. ఆ ఇంటికి ధన ప్రవాహం వస్తుంది.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇది ఊరికే చెప్పిన మాట కాదు. ఎందుకంటే... ఆమె చేసే పనులు.. అనుసరించే మార్గాలు పిల్లలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇల్లుని చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచితే.. లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మహిళలు తమ రోజూవారీ కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తే.. ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది అంటారు. అయితేయ మహిళలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడతుందట. అవేంటో చూద్దాం.

  • దేవుడికి ప్రార్థన చేసి, నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైన ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేకానీ, ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతాం అంటే.. లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుందట.


ఇది కూడా చదవండి:  ఈ 5 రాశులవారు ప్రతి విషయాన్ని డీప్‌గా ఆలోచిస్తారట!




  • సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాకాకుండా.. పొద్దెక్కిన తర్వాత లేచి క్లీన్‌ చేసుకోవడం వల్ల ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది.

  • ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకానీ, ఏ మధ్యాహ్నం తరువాత.. సాయంత్రం సమయాల్లో స్నానమాచరిస్తే.. ఆ ఇల్లు పేదరికంతోపాటు బాధలు తప్పవు.

  • కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి, వంటింట్లోకి వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాతనే వంట ప్రారంభించాలి.

  • అంతేకాదు, సూర్యాస్తమయం తర్వాత తల దువ్వటం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే.. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట.



ఇది కూడా చదవండి: ఇలా చేస్తే... ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాక... దరిద్రం వదిలిపోతుంది




  • మహిళలు ఎల్లప్పుడూ కోపంగా, చిరాకుగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సంతోషమే ఉండదు. అందుకే ప్రతి విషయానికి చిరాకు పడటం మానేయాలి. కుటుంబంతో సున్నితంగా మెలగడానికి ప్రయత్నించాలి.

  • ఇలాంటి చిన్న కిటుకు పాటిస్తే.. ఆ ఇల్లు ఎల్లప్పుడూ లక్ష్మీనివాసంగా మారడమే కాదు... ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది.

  • అంతేకాదు, ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. దీపం కొండెక్క సమయం వరకు ఇంటిని చీపురుతో శుభ్రం చేయకూడదు.

  • దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు ఇవ్వరాదు. ఇంటి బయట సాయంత్రంలోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి.

  • మెయిన్‌ డోర్‌ ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు. ఆ సమయం లక్ష్మిదేవి ఇంటికి వస్తుంది కాబట్టి శుభ్రంగా పెట్టుకోవాలి. అలా కాకుంటే లక్ష్మీదేవి ఆగ్రహించడంతోపాటు అనారోగ్య సమస్యుల కూడా వెంటాడుతాయి.

Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు