Home /News /astrology /

IF THESE ZODIAC SIGNS PEOPLE WERE ONE THEN THEY WOULD MEET FOR THE REST OF THEIR LIVES FULL DETAILS HERE PRV

Astrology: ఈ రెండు రాశుల వాళ్లు ఒక్కటైతే జీవితాంతం కలిసే ఉంటారట.. మీ రాశి కూడా ఉందేమో చెక్​ చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జీవితాంతం కలిసి ఉండాలనే కోరికతోనే ఎవరైనా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతారు. అయితే.. అన్ని వివాహాలు శాశ్వతంగా  ఉండవు. కొంతమంది మాత్రం అస్సలు విడిపోరు. మరి ఆ ఏయే రాశుల వారికి కలిసొస్తుందో చూద్దాం..

    ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్ర గుర్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశి లక్షణాలు ఆ రాశిని బట్టి ఉంటాయి. జీవితాంతం కలిసి ఉండాలనే (People were one) కోరికతోనే ఎవరైనా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతారు. అయితే.. అన్ని వివాహాలు శాశ్వతంగా  ఉండవు. గొడవలు, మనస్పర్థలు.. ఇలా వివిధ కారణాల వల్ల .. విడాకుల బాట పడుతున్నవారు చాలా మందే ఉన్నారు.ఈ క్రమంలో.. కొన్ని రాశుల జంటలు (Zodiac couples) మాత్రం... ఎప్పటికీ విడిపోరట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశుల కాంబినేషన్ లు జీవితాంతం కలిసి  ( People were one) ఉంటాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..



    ధనస్సు రాశి- మిథున రాశి..!

    ఈ రెండు రాశులు (Two Zodiac signs) ఎక్కువగా స్వతంత్రంగా ఉంటారు. అలా ఉండటానికి ఇష్టపడతారు. ఇాద్దరూ అన్ని విషయాల్లో సాహసాలు చేస్తారు. వీరు.. ఒకరితో మరొకరు అన్ని విషయాలను పంచుకుంటారు. వీరికి విసుగు అనేది ఉండదు. వీరు ఒకరికి మరొకరుగా బతికేస్తారు.

    వృషభ రాశి- కన్య రాశి..!

    ఈ రెండు రాశులు Two Zodiac signs) ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇద్దరూ కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. వారు తమ బంధాన్ని ఎక్కువ కాలం నిలపడేలా చూసుకుంటారు. అందుకోసం ఇద్దరూ కష్టపడతారు. ఈ రెండు రాశుల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్.



    సింహ రాశి- తుల రాశి..!

    తుల రాశి (Libra) వారు స్నేహపూర్వకంగా,  మనోహరంగా, అవుట్ గోయింగ్ గా ఉంటారు. సింహ (Leo)రాశి వారు అందరితో బాగా కలిసిపోతారు. చాలా ప్రకాశంవతంగా ఉంటారు.. అందరి అటెన్షన్ కోరుకుంటారు. ఈ రెండు రాశుల పెయిర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వీరి వ్యక్తిత్వాలు బాగా కలుస్తాయి. వీరి జంట చాలా బాగుంటుంది.

    మీన రాశి- కర్కాటక రాశి..!

    మీన రాశి (Pisces), కర్కాటక రాశి (Cancer).. ఈ రెండూ ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు. ప్రతి విషయంలో వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఒకరి కోసం మరొకరు ఏది చేయడానికైనా సిద్ధంగా :ఉటారు. తమ బంధం శాశ్వతంగా ఉంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.

    మేష రాశి -మీన రాశి..!

    మేష (Aries)రాశి వారు కఠినంగా , ప్రేరణతో ఉంటారు, అయితే మీనం చాలా సున్నితంగా, చాలా సహజంగా ,సంక్లిష్టంగా ఉంటుంది. ఒకరిలో లేనిదానిని మరొకరు భర్తీ చేస్తూ ఉంటారు. ఒకరికి మరొకరు సహకారంగా.. ఫుల్ సపోర్టివ్ గా ఉంటారు. అందుకే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.

    ఈ రాశుల వారు బద్ద శుత్రవులు..

    మకర రాశి (Capricorn) వాళ్లు కుంభ రాశి వాళ్లు శత్రువులు. ఎప్పుడూ కూడా వీళ్ళు కలిసి ఉండలేరు. శత్రువులుగా మాత్రమే ఈ రాశి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్సు, డబ్బులు విషయంలో శత్రువులుగా ఉంటారు. అయితే వీళ్ళకి గొడవ లేదా ఆర్గ్యుమెంట్ దేని వల్ల అయినా రావచ్చు అది ప్రొఫెషనల్ గా అయినా రావచ్చు లేదా డబ్బులు పరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇద్దరూ కూడా ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించుకోవడం జరుగుతుంది. దీనితో వీరి మధ్య గొడవలకు దారి తీస్తాయి. ఇలా ఈ రెండు రాశులు ఎప్పుడూ శత్రువులు గానే ఉంటారు. ఏదైనా సరే అలానే వుంటారు.

    సింహ రాశి.. కర్కాటక రాశి :

    కర్కాటక రాశి వాళ్లు ఎమోషనల్ . వీళ్ళు చాలా అబద్ధాలు ఆడి.... సింహ రాశి వాళ్ళని ఇరిటేట్ చేస్తారు. ఇది ఇలా ఉంటే సింహ రాశి వాళ్లు బాగా మొండిగా ఉంటారు. అయితే ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి పడదు. అలానే ఈ రెండు రాశుల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి దీని కారణంగా వీళ్ళు ఎప్పుడు శత్రువులు గానే ఉంటారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Astrology, Horoscope, Relationship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు