Home /News /astrology /

HOW ZODIAC SIGNS CONTROL THEIR MONEY AND WEALTH HERE IS THE DETAILS IN TELUGU SU GH

Zodiac Signs: ఆస్తి, సంపద విషయంలో ఏ రాశి వాళ్లు ఎలా ఆలోచిస్తారు.. డబ్బు కంట్రోల్ చేయడంలో ఈ రాశుల వారు బెస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనిషి జీవితంలో డబ్బు, ఆస్తికి ఉండే ప్రాధాన్యతే వేరు. జీవితంలో చాలా విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అయితే డబ్బు, సంపాదన మీద అదుపు ఉన్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం.

మనిషి జీవితంలో డబ్బు, ఆస్తికి ఉండే ప్రాధాన్యతే వేరు. జీవితంలో చాలా విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అయితే డబ్బు, సంపాదన మీద అదుపు ఉన్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం. ఇదంతా రాశుల ఆధారంగా సాగుతుందంటున్నారు జ్యోతిషులు. అయితే ఇవి కూడా ఒక్కో రాశి వారు ఒక్కో విధంగా ఉంటాయి. పలు రాశుల వారికి డబ్బు, సంపాదన అదుపు ఉండగా.. కొన్ని రాశులవారు కష్టపడి సంపాదించిన ఇతర చేతుల్లో మోసపోవడం, అధికంగా ఖర్చు చేయడం వంటివి జరుగుతాయని జ్యోతిష నిపుణలు చెబుతున్నారు. మరి ఏ రాశివాళ్లు ఎలా డబ్బు, ఆస్తిని అదుపు చేస్తారో చూద్దాం!

* మేషం
మేష రాశివారు డబ్బును హ్యాండిల్‌ చేయడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా అంకితభావంతో కష్టపడి పని చేస్తారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు.

* వృషభం
తమ రంగంలో ఉన్నత స్థితికి చేరడానికి ఈ రాశివాళ్లు కష్టపడి పని చేస్తారు. ఈ క్రమంలో ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. దాంతో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి... సంపాదించిన దానికంటే ఎక్కువ ధనాన్ని ఖర్చుపెట్టడానికి వెనుకాడరు.

* మిథునం
మిథున రాశివాళ్లు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. కొన్నిసార్లు ఇతరుల చేతిలో మోసపోతుంటారు. లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేధించడం వీరికి అంత సులభం కాదు. ధనం విషయంలోనూ అంతే. డబ్బు, ఆస్తిని వీళ్లు అంత సులభంగా మేనేజ్‌ చేయలేరు.

* కర్కాటకం
కర్కాట రాశివాళ్లకు దృఢ సంకల్పంతో పాటు కాస్త బద్ధకం కూడా ఉంటుంది. దీని వల్ల పనులు ఆలస్యంగా సాగుతాయి. సరైన స్పష్టత లేకపోవడంతో లక్ష్యాన్ని సమయానికి చేరుకోలేరు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నా... ఫలితం ఉండదు. ట్రేడింగ్‌ ద్వారా డబ్బును సంపాదిస్తారు. ఈ క్రమంలో ఇతరుల భాగస్వామ్యాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

* సింహం
ఏ పని చేసినా ముక్కుసూటిగా, ముందస్తుగా ఆలోచించి చేయడం సింహ రాశి వారి లక్షణం. అదే స్థాయిలో డబ్బులు కూడా సంపాదిస్తారు. ఈ లక్షణం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది కూడా. డబ్బులు సంపాదించి, సక్రమంగా నిర్వహించాలనుకునేవారికి ముఖ్యంగా ఈ లక్షణం అవసరం.

* కన్య
డబ్బును ఆదా చేయడం, తెలివిగా ఖర్చు చేయడం లాంటివి కన్య రాశి వారి లక్షణాలు. ఇతరులకు సంబంధించిన డబ్బును కూడా వీళ్లు చాలా సులభంగా మేనేజ్‌ చేయగలరు. అయితే తమ దగ్గర ఉన్న డబ్బు గురించి ఇతరులకు చెప్పడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. దీంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించలేరు. తక్కువలో బతకడానికి ఇష్టపడుతుంటారు.

* తుల
వీళ్లకు ఇతర రాశివారి లాగా కష్టపడే తత్వం లేకపోయినా... డబ్బులు బాగా సంపాదించగలరు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, డబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల ధనవంతులుగా కనిపిస్తారు. అయితే వాటిని సరైన విధానంలో ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

* వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సాహంతో పని చేస్తుంటారు. దాని కోసం ఎప్పుడు, ఏం చేయాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. అంతేకాదు ఈ రాశివారు ఖర్చుపెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.

* ధనుస్సు
కుటుంబం నుంచి వ్యాపారం లేదా ఆస్తి ధనుస్సు రాశివారికి వారసత్వంగా దక్కుతుంటుంది. అంతే ఇలా వచ్చినదాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. అవసరం లేకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టని తత్వం వారిది. ఎంత కష్టపడి పని చేసినా అవసరమైన లాభం పొందలేకపోవడం ఈ రాశివారి మైనస్ అని చెప్పొచ్చు.

* మకరం
మకర రాశివారు పని పట్ల నిబద్ధతతో ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. వాళ్ల కష్టానికి ఫలితంగా చక్కటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. యుక్తవయసు నుంచే సంపాదన ప్రారంభిస్తారు కాబట్టి ఆర్థికంగా బాగానే నిలదొక్కుకుంటారు.

* కుంభం
ధనవంతులు కావడానికి ఈ రాశివాళ్లు తమ శక్తుల్ని ఏకం చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈ క్రమంలో షార్ట్‌కట్స్‌కు ప్రాధాన్యమివ్వరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తత్వం వల్ల ధనాన్ని చక్కగా అదుపులో పెట్టుకోగలరు.

* మీనం
మీన రాశివాళ్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. సంపదను హ్యాండిల్‌ చేయడంలో సలహాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కష్టపడి పని చేయడం ఒకటే మార్గమని తెలిసినా... ఆ పని చేయలేకపోతారు. కానీ తెలివిగా డబ్బు సంపాదిస్తారు. సరైన మార్గంలో ఉండటానికి ఎప్పుడూ నైతిక నియమావళిని అనుసరిస్తుంటారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Astrology, Money, Zodiac signs

తదుపరి వార్తలు