Navagraha dosham: నవగ్రహ దోషాలు పొగొట్టుకోవడానికి కొన్ని పరిహారాలు!

ప్రతీకాత్మక చిత్రం

Navagraha dosham: పుట్టినరోజు పంచదార, పప్పు, నెయ్యి, బియ్యం దానం చేస్తే.. ఇంట్లో అన్నపూర్ణ దర్శనం లభిస్తుంది.

  • Share this:
నవగ్రహ (Navagraha) దోషాలు అంటేనే అందరూ భయపడతారు. ఎందుకంటే ఈ దోషాల వల్ల అనేక ఇబ్బందులు (problems) కలుగుతాయి. వృత్తిలో ఏ పని చేపట్టినప్పటికీ నష్టమే (losses) కలుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. శూన్యమే అనిపిస్తుంది. అటువంటి దోషాలకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. ముఖ్యంగా కులదేవత ఆరాధన చేస్తే.. కుటుంబంలో సంభవించే కష్టాలు తొలగి మీకు విజయం చేకూరుతుంది అంటారు.

కొన్ని పరిహారాలు..

  • జీవితంలో వైఫల్యాలు (failures) ఎదుర్కొనేవారు వాటిని ఎదుర్కొని నమ్మకంతో జీవితాన్ని ముందుకు సాగుతారు. లేనివారికి, ఆకలితో ఉన్నవారికి దానం చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. శనివారం అన్నదానం చేయడం వల్ల నవగ్రహ దోషాలు పోతాయి. జీవితం వృద్ధి చెందుతుంది.


ఇది కూడా చదవండి:  స్క్రీన్‌ వర్క్‌ ఎక్కువై.. మెడనొప్పి వస్తోందా? ఇలా ఈజీగా..!

  • ఆవుపాలను 15 రోజులపాటు ఏదైనా దేవాలయానికి ఇవ్వాలి.

  • శని, మెర్క్యూరీ ప్రభావాలను నివారించడానికి నీలం, ఆకుపచ్చ దుస్తులకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ

  • పసుపును నుదుటిపై ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది.

  • అంధులకు స్వీట్లు పంచడం వల్ల శనికి సంతోషం కలుగుతుంది. బియ్యాన్ని ఒక గుప్పెడు పారుతున్న నది లేదా సరస్సులో విడవడం వల్ల చంద్రుడి బలం పెరుగుతుంది.

  • సూర్యుడికి నమస్కరించడం వల్ల మెర్క్యూరీ బలం  కూడా పెరుగుతుంది. పిల్లలకు విద్య మెరుగుపడుతుంది.

  • గురువారాల్లో దేవాలయాల్లో లడ్డూను నైవేద్యంగా పెడితే.. గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా

  • గురువారం రోజు వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండటం మంచిది.


ఇది కూడా చదవండి:  కలలో మీ భాగస్వామితో విడిపోతే ఏం జరుగుతుందో తెలుసా?

  • ఆలయానికి ఏదైనా వస్తువును 16 రోజుపపాటు దానం చేయడం వల్ల కేతు ప్రీతికి అనువైంది.

  • మీరు బయటకు వెళ్లే ముందు పర్స్‌లో ఏదైనా వెండి నాణం లేదా చేతికి వెండి ఉంగరం ధరించడం వల్ల కూడా శుక్రుడికి మంచిది.

  • ప్రతిరోజూ ఆంజనేయస్వామిని పూజించడం వల్ల శనిగ్రహం కలిగే బాధలు తొలగిపోతాయి.

  • పుట్టినరోజు పంచదార, పప్పు, నెయ్యి, బియ్యం దానం చేస్తే.. ఇంట్లో అన్నపూర్ణ దర్శనం లభిస్తుంది.

  • శుక్రవారం రోజు గోవులకు గడ్డి తినిపించడం వల్ల కూడా శుక్రుని అనుగ్రహం కలుగుతుంది.

Published by:Renuka Godugu
First published: