దీపావళి (Diwali 2021) అలంకరణ ఇంటి శుభ్రంతో మొదలవుతుంది. దీంతో పూజగది (pooja room) ని కూడా అలంకరించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైంది. దీపావళి రోజు పూజగదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పూజగదిని ఎలా అందంగా.. తక్కువ సమయంలో అలంకరించుకోవాలో తెలుసుకుందాం.
దీపావళికి (Diwali 2021) ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి పూజగది శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీపావళికి ఎవరైనా అతిథి ఇంటికి వచ్చినా వారు మొదటగా దర్శనం చేసుకునేది పూజగదినే. అందుకే మీ పూజగదిని ఇతరులకు భిన్నంగా అలంకరించాలని ఆలోచిస్తున్నారా? పూజగదిని అందంగా అలంకరిస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ పవిత్రమైన పండగ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తే.. లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
పూజగదిని అలంకరించుకునే విధానం..
దేవుళ్లకు ఎరుపు, పసుపు రంగు చాలా ఇష్టం. అందుకే పూజగది అలంకరణకు ఈ రంగులనే ఉపయోగించండి. ఇది మీ పూజగదిని అందంగా కనిపించేలా చేస్తుంది. దీనికి ఏదైనా చీర లేదా దుపట్టా ఉపయోగించవచ్చు. గోడపై పిన్‌ను ఉంచడం ద్వారా వివిధ ఆకృతుల్లో పూజగదిని అలంకరించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: జాగ్రత్త! డెంగీదోమ ఈ టైంలోనే ఎక్కువగా తిరుగుతుందట..
పూలు..
పూజల సందర్భంగా పూలను ఉపయోగించాలి. దీనివల్ల పూజగది చాలా భిన్నంగా కనిపిస్తుంది. పూజగది గుమ్మానికి లేదా వెనుక గోడకు పూల దండను వేసి అలంకరించుకోవచ్చు. ఇంకా పూలతో రంగోలి వేసుకోవచ్చు.
కలర్ పేపర్స్‌తో క్రాఫ్ట్..
దీపావళి రోజున మీరు పేపర్ క్రాఫ్ట్ సహాయంతో పూజగదిని అలంకరించుకోవచ్చు. రంగురంగుల తీగల మాదిరి హ్యాంగ్ చేసుకోవచ్చు. దీపాలను కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీ పిల్లల సహాయం కూడా తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!
లక్ష్మీ పాదాలు..
పూజగది దగ్గర లక్ష్మీదేవి పాదాలు వేసుకోవాలి. దాని వద్ద దీపం వెలిగించుకోవాలి. లక్ష్మీదేవి పాదాలు ఇలా పూజగది దగ్గరలో వేసుకోవడం వల్ల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మీకు కావాలంటే రంగోలి ద్వారా కూడా వేసుకోవచ్చు. స్టిక్కర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.
కుండ..
మీ ఇంట్లో పాత కుండలు ఏవైనా ఉంటే వాటిని భద్రపరుచుకోండి. ఈ సమయంలో ఉపయోగించడానికి వీలుంటుంది. ఆ కుండను రంగులతో పెయింట్ చేసి, మెరిసే పాలిథిన్ మొదలైన వాటితో అలంవరించుకోవచ్చు. ఇది మీ పూజగదికి అందాన్ని పెంచుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2021