Home /News /astrology /

HOROSCOPE WEEKLY 7TH NOVEMBER TO 13TH NOVEMBER HERE IS RASI PHALALU RASHIFAL TELUGU ASTROLOGY KNOW YOUR ZODIAC SIGN DETAILS SK

Weekly Horoscope: ఈ రాశుల వారు ఇల్లు కొనే ఛాన్స్.. న‌వంబ‌ర్ 7 నుంచి 13 వరకు వార ఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: :న‌వంబ‌ర్ 07 నుంచి న‌వంబ‌ర్ 13 వరకు రాశి ఫలాలు. ఈ వారం ఏయే రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  నవంబరు 7 నుంచి నవంబరు 13 వరకు...

  వార ఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్ధలం గానీ కొనే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు మళ్లీ మీ చేతికి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్ధులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమ‌య్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కాస్తంత తిప్పట, శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్ధులు బాగాశ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ‌ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ధ్ర, పునర్వసు 1,2,3) గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ధన యోగ సూచనలున్నాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అష్టమ శని కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారీ అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండ‌వు.

  మీ శరీరంలో ఈ ప్రదేశాల్లో పుట్టు మచ్చలు ఉన్నాయా..? అదృష్టమో లేదా దురదృష్టమో తెలుసుకోండి.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు లేదు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సాయపడతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం చూసుకోవాలి.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడతారు. పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. విద్యార్ధులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోనివారికి అనుకూల సమయం. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఉండవచ్చు.

  మిమ్మల్ని ఈజీగా వదిలేసే 5 రాశులవారు ఎవరంటే...!

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్‌ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా కష్టనష్టాలకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ‌) గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆశించిన పనులన్నీ శమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చి౦తన సెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పరవాలేదు. డాక్ట‌ర్‌, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. బ్యాంకర్తు, వ్యాపారులు, ఆర్థిక రం గంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫ‌ర్లు వచ్చే అవకాశం ఉంది.

  ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్జు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతాన౦లో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభ కార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ప‌రేమ వ్యవహారాల్లో మరింతగా ముందడుగు వేస్తారు. ఐ.టి, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం చాలా బాగుంది.

  Vastu Tips: మీ ఇంట్లో ఆ విగ్రహం ఉంటే.. అన్నీ శుభాలే.. వివరాలిలా..

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆర్థికంగా మిమ్మల్ని సన్నిహితులెవరో మోసం చేసే అవకాశం ఉంది. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు రావచ్చు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

  కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్ధవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ‌ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉ౦డడం మంచిది.

  ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా?.. ఈ ఐదు రత్నాలు ధరిస్తే మీ చేతి నిండా డబ్బే!

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. అదాయపరంగా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూరప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విద్యార్ధులు శ్ర‌మ‌ మీద పురోగతి సాధిస్తారు. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. పేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సంతానం కలిగే సూచనలున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope Today, Rashifal, Rasi phalalu, Weekly Horoscope

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు