Horoscope Weekly: వార ఫలాలు. ఆదాయం స్థిరం, ఖర్చుల భారం

Horoscope Weekly: వార ఫలాలు.

Horoscope Telugu: రాశిఫలాలు ప్రతి వారం మారిపోతూ ఉంటాయి. ఈ వారం జులై 25, 2021 నుంచి జులై 31, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly Telugu: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఒక రాశి ఉంటుంది. ప్రతి రాశికీ మంచీ, చెడూ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ఆర్థిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? పంచాంగం ఎలాంటి అంశాలను సూచిస్తోంది? ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? ఈ వారం రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా అవరోధాలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. ఈ వారం జులై 25, 2021 నుంచి జులై 31, 2021 వరకు వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల డబ్బు నష్టపోతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది.

    వృషభ రాశి (Taurus)
    నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమించినవారితో పెళ్లి జరిగే సూచనలున్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలకు అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి: White Pearl: తెల్ల ముత్యం ఎవరు ధరించాలి? ప్రయోజనాలేంటి?

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయం పడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాలవారు అభివృద్ధి సాధిస్తారు.

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

    సింహ రాశి (Leo)
    అన్నిటికీ సమయం అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చేయాల్సిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    కన్య రాశి (Virgo)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేదని గుర్తించండి. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ఠ పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉన్నా పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    తుల రాశి (Libra)
    ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేనందువల్ల వ్యక్తి గత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Vastu tips: ఇంట్లో ఇవి ఉంటే దరిద్రం పట్టినట్లే...

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగంలో అధికారుల నుంచి లక్ష్యాల విషయంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి సమయం అంతగా అనుకూలంగా లేదు. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి (Sagittarius)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధు మిత్రుల నుంచి సహాయం అందుతుంది. తిప్పట ఎక్కువగా ఉన్నా పనులు పూర్తి చేస్తారు. ఐ.టి, వృత్తి నిపుణులకు, బ్యాంకర్లకు రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది.

    మకర రాశి (Capricorn)
    ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందులు పడతారు. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అను కూలంగా ఉంది. శుభవార్త వింటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా శ్రమ పెరుగుతుంది.

    కుంభ రాశి (Aquarius)
    నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తి చేస్తారు. సహెూద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో సహోద్యోగుల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవ కాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published: