• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY THESE ZODIAC SIGNS WIN IN JOBS AND BUSINESS CHECK YOUR RASI PHALALU IN 5 5 2021 ASTROLOGY NK

Horoscope 5-5-2021: ఈ రాశుల వారికి నేడు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు

Horoscope 5-5-2021: ఈ రాశుల వారికి నేడు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు

Horoscope 5-5-2021: ఈ రాశుల వారికి నేడు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు

Horoscope today 5-5-2021: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయం. ఇది మంచి సంకేతం. ఇలాగే తగ్గిపోతే మంచిది. మరి జ్యోతిష పండితులు నేటి రాశి ఫలాలపై ఏమంటున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope 5-5-2021: దేశ ప్రజల్లో కాన్ఫిడెన్స్ బాగుంది. ఎలాంటి సమస్యలు వస్తున్నా... వారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం ప్లవనామ సంవత్సరం కావడమే అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ సంవత్సరం మొత్తం ప్రజలు ఇలాగే ముందడుగులు వేస్తారనీ... వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని అంటున్నారు. మరి ఈ పోరాట రోజుల్లో రాశి ఫలాలు ఏం చెబుతున్నాయి... ఇవాళ ఎవరికి ఎలాంటి ఫలాలు దక్కబోతున్నాయి? ఆర్థిక వ్యవహారాలు ఎవరికి కలిసొస్తాయి? ప్రేమ, వివాహ వ్యవహారాల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి వివరాలను తిథి, నక్షత్రం, గ్రహాలు, కాలం, వర్జ్యం వంటి వాటిని లెక్కలోకి తీసుకొని ఇప్పుడు తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. తోటివారి
    సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

    సింహ రాశి (Leo)
    గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఉన్నా ముందుకు దూసుకు వెళ్తారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎదుగుదకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టిన పనులు విజయాన్ని ఇస్తాయి.

    కన్య రాశి (Virgo)
    ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్త వింటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని లాభాలు ఉంటాయి.

    తుల రాశి (Libra)
    అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత
    కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది.

    ధనస్సు రాశి (Sagittarius)
    వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ, వాహన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

    మకర రాశి (Capricorn)
    బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Mamata Banerjee: నేడు సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణం... ప్రధాని పదవిపై ఫోకస్?

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవా లేదు.
    Published by:Krishna Kumar N
    First published: