Home /News /astrology /

Horoscope 6-8-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభవార్త.. ఆదాయం పెరుగుతుంది

Horoscope 6-8-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభవార్త.. ఆదాయం పెరుగుతుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: ఈ రోజు శుక్రవారం. ఇవాళ కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంది. ఉద్యోగ వాతావరణం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా వస్తుంది. మరికొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఆర్థిక సమస్యలు రావచ్చు. మరి ఎవరికి ఎలా ఉందో.. ఇవాళ్టి రాశి ఫలాల్లో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము. భవిష్యత్‌లో మనకు ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. రాశి ఫలాల ఆధారంగా కొంత వరకు మన భవితవ్యాన్ని జ్యోతిష నిపుణులు అంచనా వేస్తున్నారు. వారు చెప్పే దిన, వార, మాస ఫలాలను చాలా మంది విశ్వసిస్తారు. మరి ఇవాళ్టి దిన ఫలాల్లో ఎవరికి ఎలా ఉంది? జ్యోతిష నిపుణులు ఎలాంటి జగాత్రలు సూచిస్తున్నారు. ఇక్కడ తెలుసుకుందాం.


  కాలజ్ఞానం

  దినఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం సాఫీ గానే సాగిపోతుంది. వివాహ ప్రయత్నం సఫలమవుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహ చరులతో విభేదాలు పెట్టుకోవద్దు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతుంది.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. తలచిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. చాలా కాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ వాతావరణం అన్ని విధాలా సానుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన శుభ కార్యం తలపెడతారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వ్యాపారులకు చాలా బాగుంది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పెళ్లి ఖాయమవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. స్నేహితురాలికి కానుకలిస్తారు.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో మీ బాధ్యతల్లో మార్పు చోటు చేసుకుంటుంది. మిత్రుల సహకారంలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దాన ధర్మాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో ఆ నందంగా గడుస్తుంది.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అధికారులు సహకరిస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ల యాలు తీసుకోండి. స్పెక్యులేషన్ పరవాలేదు. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. వ్యాపారులు శ్రమప డాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలితో బాగా గడిచిపోతుంది.
  అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అందరినీ కలుపుకుని పోవడమనేది మంచి విధానం. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. త్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. కొత్తవారు పరిచయమవుతారు. వ్యాపారుల లాభార్జన నిలకడగా ఉంటుంది. స్నేహితురాలితో విహారం చేస్తారు.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) తోటి ఉద్యోగుల సహకరించకపోయినా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో విందులో పాల్గొంటారు.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. అనుకోని విధంగా కొంత డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా కస్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చు అవుతుంది.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులు ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు బిజీ అయిపోతుంది.

  మీనం (పూర్వా భాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగ జీవితంలో చికాకులు తలెత్తుతాయి. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉన్నసంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. వ్యాపారుల ఆదాయం నిలకడగా ఉంటుంది. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Rashi fal, Rasi phalalu, Zodiac sign

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు