Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పండగే.. కోరుకున్న చోట ఉద్యోగం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు గురువారం. ఇవాళ కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంది. శుభవార్తలు వింటారు. కోరుకున్న చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. మరికొందరు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. ఎవరికీ హామీగా ఉండొద్దు. మరి మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

 • Share this:
  కాలజ్ఞానం

  దిన ఫలాలు

  ఆగస్టు 26, 2021

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగంలో ప్రమోషన్ కు వీలుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారులకు పరవాలేదు. అయితే, ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  ఉద్యోగంలో కొత్త లక్ష్యాల వల్ల పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఏమాత్రం లేదు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. హామీలు ఉండవద్దు.

  Zodiac Signs: రాశుల్లో కార్డినల్ రాశులేవి? వాటి ప్రత్యేకతేంటి?

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర , పునర్వసు 1,2,3)
  మీరు కోరుకున్న చోట ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి తోబుట్టువుల నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యం తలపెడతారు. వ్యాపారులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సహెూద్యోగులు మిమ్మల్ని చిక్కుల్లో ఇరికించే అవకాశం ఉంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు ఆర్థికంగా బలపడతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయాలు, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగుంది.

  Zodiac Signs: ఏ రాశుల వారికి ఏ హాబీలు ఉంటాయి?

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్యఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు శ్రమపడాల్సి వస్తుంది.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.

  Zodiac Signs: సైన్స్ లేక సోషల్.. ఏ రాశికి ఏ సబ్జెక్ట్ నచ్చుతుంది?

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. అనుకున్న పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు సహకారం అందిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  ఉద్యోగంలో పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగవుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. అనవసర ఖర్చులకు కళ్లెం వేయండి. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయండి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు.

  Vastu Tips: నల్లమట్టిలో ఇల్లు కడితే ఏమవుతుంది?

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అభివృద్ధికి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పరిచయస్థులతో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఖర్చులు పెరుగుతాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: