Home /News /astrology /

HOROSCOPE TODAY TELUGU ASTROLOGY RASHI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS THESE PEOPLE HAVE FINANCIAL PROBLEMS SK

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు.. ఇబ్బందులు తప్పవు

Horoscope  11-6-2021: నేటి రాశి ఫలాలు

Horoscope 11-6-2021: నేటి రాశి ఫలాలు

Today Horoscope: జూన్ 11 రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు.. మొత్తం 12 రాశుల వారికి నేడు ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    కాలజ్ఞానం

    దినఫలం

    జూన్‌ 11, 2021

    మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 )

    అధికార యోగం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహాయంతో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. జీవితానికి సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సంతానం పురోగతి చెందుతారు. మంచి కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించినస్థాయిలో లాభాలు ఆర్జిస్తారు.

    వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)

    ఉద్యోగంలో భ్రమ ఎక్కువైనా సత్ఫలితాలు సాధిస్తారు. అధికారుల ప్రోత్సాహంఉంటుంది. వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. ప్రస్తుతానికి స్పెక్యులేషన్‌ కూడా లాభించదు. ఒక వ్యక్తిగత సమస్యను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు.

    మిథునం (మృగశిర 3, 4, అర్ద్ర, పునర్వసు 1, 2, 3)

    వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. కొద్ది ఖర్చుతో అనారోగ్యం నుంచి బయటపడతారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రేమించినవారితోనే పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తారు.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, అశ్లేష)
    ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.

    కన్య (ఉత్తర 2, 3, 4 హస్త, చిత్త 1, 2)

    ఉద్యోగంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి పథకాలు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

    తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1 2, 3)

    వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం జాగ్రత్త వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

    ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం పెండింగ్‌లో పడుతుంది. వృత్తి, వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.

    ధనుస్సు (మూల, పూర్వాషాధ, ఉత్తరాషాఢ 1)

    గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకే కాదు. నిరుద్యోగులకు కూడా టైమ్‌ బాగుంది. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)

    ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సమస్య ఒకటి టెన్షన్‌ ఇస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఒక మిత్రుడిని నమ్మి బాగా నష్టపోతారు. హామీలు ఉండవద్దు.

    కుంభం (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)

    ఉద్యోగంలో మిమ్మల్ని అధికారులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువర్గంలో వివాహ సంబంధం కుదురుతుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    ఉద్యోగ వాతావరణం సానుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రులు మీకు చేదోడువాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    తదుపరి వార్తలు