Home /News /astrology /

HOROSCOPE TODAY TELUGU ASTROLOGY JUNE 18 RASI PHALALU THESE ZODIAC SIGNS WILL FACE FAMILY PROBLEMS SK

Horoscope June 18, 2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి కుటుంబ సమస్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: జూన్ 18, 2021 రాశి ఫలాలు. ఇవాళ ఏ రాశుల వారికి ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

    దినఫలం

    జూన్‌ 18, 2021

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    ఉద్యోగ జీవితంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. సరిగ్గా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించండి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది,

    వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగశిర 1, 2)

    అనుకోని ఆటంకాల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇంటా బయటా పనుల ఒత్తిడి ఉంటుంది. జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ది కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం పెండింగ్‌లో పడుతుంది.



    కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగంలో ఇబ్బందులు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య ను౦చి చాకచక్యంగా బయటపడతారు. కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం. బంధువుల ద్వారా లాభపడతారు.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. పెళ్లి సంబంధం ఆలస్యం అవుతుంది.

    కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1,2)

    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జ్యాగ్రత్త, వ్యాపారంలో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు.

    తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)

    ఉద్యోగంలో అధికారుల వల్ల బాగా ఒత్తిడి ఉంటుంది. ఆటంకాలు, అవరోధాలు ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జా(గ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్వేష్ట)
    మంచి శుభయోగాలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థితి కనిపిస్తోంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

    ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులకు మంచి ఆపర్లు వస్తాయి.

    మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ఠ 1, 2)

    అనుకున్న పనులు నెరవేరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కూడా చాలావరకు కుదుటపడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్నీ మీకు సానుకూలమవుతాయి.

    కుంభం (ధనిష్ట 3, 4 , శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩)

    ఆటంకాలు, అవరోధాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దగ్గరి బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉద్యోగపరంగా స్థిరమైన ఫలితాలుంటాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu

    తదుపరి వార్తలు