Home /News /astrology /

Horoscope 29-7-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఇవాళ అద్భుతంగా ఉంది..

Horoscope 29-7-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఇవాళ అద్భుతంగా ఉంది..

Horoscope 29-7-2021: నేటి రాశి ఫలాలు

Horoscope 29-7-2021: నేటి రాశి ఫలాలు

Horoscope 29-07-2021: నేడు గురువారం. ఇవాళ ఏ రాశుల వారికి ఎలా ఉంది.? ఎవరికి బాగుంది? ఎవరికి బాగా లేదు.? జ్యోతిష పండితులు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు.? రాశుల వారీగా దిన ఫలాల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  దిన ఫలాలు

  జూలై 29, 2021

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో హెూదా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. మిత్రుల్లో ఒకరు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నం కలిసి వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, మిత్రులకు కొద్దోగొప్పో సహాయం చేస్తారు. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండదు. ఉద్యోగంలో చికాకులు ఎదురవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వ్యాపారులు మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణ సూచనలున్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫ లితాలను ఇస్తాయి.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. రుణ బాధ నుంచి బయటపడతా రు. రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు పరవాలేదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. విదేశా ల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు, వృత్తి నిపుణులకు సమయం చాలా బాగుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. చిన్ననాటి స్నేహితులు, వెనుకటి సహెూద్యోగులు పలకరిస్తారు. సంతానం నుంచి కొన్ని మంచి కబుర్లు వింటారు. ఆరోగ్యం పట్ల వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆస్తులు పెంచుకునే ఆలోచన చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలవారు లాభార్జన చేస్తారు. ప్రేమికులకు ఇబ్బందులు ఎదురవుతాయి. బాగా తెలిసినవారితో వివాహ సంబంధం కుదరవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) రోజంతా సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభాలపరంగా వ్యాపారులు పురోగతి సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారులకు పరవాలేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. స్పెక్యులేషను దూరంగా ఉండండి.


  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో సానుకూలమైన మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారస్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధ కొంత తగ్గించుకుంటారు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోతారు. ఒక వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Weekly Horoscope

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు