Home /News /astrology /

HOROSCOPE TODAY RASHI PHALALU ON 7TH JULY 2022 THESE ZODIAC SIGNS HAVE GOOD DAY ASTROLOGY PREDICTIONS TODAY GH PJC SRD

Horoscope Today: జులై 7 దిన ఫలాలు.. ఈరోజు వారికి తిరుగులేదు.. ఇమేజ్ పెరుగుతోంది..

Horoscope Today

Horoscope Today

Horoscope Today: నేడు అంటే జులై 7, 2022న (July 7) రాశిచక్రం (Zodiac)లోని కొన్ని రాశుల వారికి సరదాగా సమయం గడిచిపోతే కొన్ని రాశుల వారికి కాస్త నిరాశగా గడిచిపోవచ్చు. ఈ రోజు విద్యార్థులు, టీచర్లు చాలా బిజీగా సమయం గడపవచ్చు.

నేడు అంటే జులై 7, 2022న (July 7) రాశిచక్రం (Zodiac)లోని కొన్ని రాశుల వారికి సరదాగా సమయం గడిచిపోతే కొన్ని రాశుల వారికి కాస్త నిరాశగా గడిచిపోవచ్చు. ఈ రోజు విద్యార్థులు, టీచర్లు చాలా బిజీగా సమయం గడపవచ్చు. పాత స్నేహితులను కలవడానికి కొందరికి ఇదే మంచి రోజు అవుతుంది. కొందరికి ఈ రోజు కోరుకునే కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఇంకా 12 రాశుల వారికి నేడు (Today Horoscope) ఎలా గడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి : గత కొద్ది రోజులుగా వేధిస్తున్న గడ్డు పరిస్థితులు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. భాగస్వామ్యాలు ఏవైనా ఉంటే మరింత ప్రయోజనకరంగా మారతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇదే సరైన సమయం. పగలు పట్టుకోకపోవడమే మంచిది.

లక్కీ సైన్- నీలం నీలమణి

వృషభరాశి : ఏదైనా పర్ఫామెన్స్ కోసం సిద్ధమయ్యే వారికి ఈ రోజు మొత్తం రిహార్సల్స్, ప్రాక్టీస్ సెషన్‌లకే సరిపోతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు సాధారణ రోజు కంటే కాస్త బిజీగా ఉంటారు. వర్క్ ప్లేస్‌లో కొంత పాజిటివ్ డెవలప్‌మెంట్ కనిపిస్తుంది.

లక్కీ సైన్ - ఒక సిలికాన్ అచ్చు

మిథునరాశి : నేడు ఆఫ్‌లైన్ లేదా వర్చువల్ షాపింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి చిన్న ట్రిప్ వేయవచ్చు. మీరు లేనప్పుడు వర్క్ కంట్రోల్‌లోనే ఉందని నిర్ధారించుకోవడం మంచిది. సరిగా వంట చేయని ప్రదేశాల్లో, బయట తినడం మానుకోవడం శ్రేయస్కరం.

లక్కీ సైన్ - ఇసుక గులాబీ రాయి/సాండ్ రోజ్ స్టోన్

కర్కాటకం : ఫొటోలు చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి.. ఫోన్ కాల్‌ల ద్వారా పాత పరిచయాలతో కులాసాగా మాట్లాడడానికి మంచి రోజిది. నేడు కొన్ని సమయాల్లో మానసికంగా కుంగిపోయినట్లు అనిపించవచ్చు. చక్కటి వ్యాయామం లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందొచ్చు.

లక్కీ సైన్ - యెల్లో సిట్రిన్

సింహరాశి : వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి శక్తివంతమైన రోజిది. ఇప్పుడు నిర్ణయించిన మార్పులు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఒక కొత్త యంత్రాంగాన్ని వర్క్ ప్లేస్‌లో మీరు క్రియేట్ చేయవచ్చు. దీన్ని చూసి మీపై మీరే విమర్శలు చేసుకోవచ్చు.

లక్కీ సైన్ - పైరైట్

కన్యారాశి : చాలా కాలం నుంచి కలవని స్నేహితులను మీట్ అయ్యేందుకు ఇది మంచి రోజు. నేడు ఒంటరిగా సమయం గడపాలనే కోరిక పుట్టొచ్చు. బిజీగా గడిపే కాలం త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వడం ఉత్తమం.

లక్కీ సైన్ - ఒక నల్ల క్రిస్టల్

తులారాశి : ఈరోజు ఒక కోరిక కోరుకోవడం ద్వారా గతంలో కంటే త్వరగా దానిని సాధించవచ్చు. ఈరోజు మీరు ఎన్నో పనులు చేస్తూ మానసికంగా చురుకుగా గడుపుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడాన్ని కూడా నేడు పరిగణించవచ్చు.

లక్కీ సైన్ - డ్రీమ్‌క్యాచర్

వృశ్చికరాశి : ప్రియమైన వ్యక్తి మీతో మంచిగా ప్రవర్తించడాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. పని చేయడానికి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సరైన సమయమిది. తెలిసిన వారు ఒక కొత్త ఆఫర్‌ను అందించవచ్చు. ఈ ఆఫర్‌ను మీరు అంగీకరించవచ్చు. కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

లక్కీ సైన్ - గులాబీ క్వార్ట్జ్

ధనుస్సు రాశి : పెండింగ్‌లో ఉన్న చట్టపరమైన విషయాలపై శ్రద్ధ వహించడానికి ఇది ఉత్తమమైన రోజు. ఒక పరిష్కారం మీకు బాగా సహాయపడవచ్చు. అలానే మీ ఇమేజ్‌ని ఇంప్రూవ్‌ చేయవచ్చు. ఈ రోజు దాదాపు మీకు తిరుగులేదు. ఉద్యోగ రంగానికి ఈరోజు ప్రాధాన్యత లభిస్తుంది.

లక్కీ సైన్ - నీలిరంగు టూర్మాలిన్

మకరరాశి : కొన్నిసార్లు సంబంధాలు, అనుబంధాల నుంచి అతిగా ఆశించడం మిమ్మల్ని బాధపెడుతుంది. ఆశించిన విధంగా మీకు ప్రియమైన వారు ప్రవర్తించకపోతే అంతటితో వదిలేయడం మంచిది. ఈ రోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. వీటిని నేర్చుకునే సామర్థ్యం మీలో కూడా ఉందా అని మీకు మీరే తెలుసుకుని సర్‌ప్రైజ్ అవ్వొచ్చు.

లక్కీ సైన్ - పచ్చని తోట

కుంభరాశి : మార్కెట్‌ను విజిట్ చేసే అవకాశమున్నందున నేడు మీరు బిజీగా గడపవచ్చు. ఈ రోజులో సగం సమయంలో మీరు నిశ్శబ్దంగా ఉండవచ్చు. ఎక్కువగా బయట తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బందులు తప్పవు.

లక్కీ సైన్ - గులాబీ బంగారు ఉంగరం

మీనరాశి : మీ బడ్జెట్‌ను చాలా తెలివిగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే లెక్కకు మించి ఖర్చులు పెరగవచ్చు. తేలికపాటి తలనొప్పి లేదా అసౌకర్యం కూడా బాధించవచ్చు. రోజూ లాగానే ఈ రోజును గడపాలి. తర్వాత పనులను ప్రారంభించాలి.

లక్కీ సైన్ - ఈక
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi Phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు