Home /News /astrology /

HOROSCOPE TODAY ON OCTOBER 30 HERE IS TELUGU ASTROLOGY RASI PHALALU RASHIFAL KNOW YOUR ZODIAC SIGN FORTUNE HERE SK

Horoscope Today: అక్టోబరు 30 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. మంచి సంస్థలో జాబ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేటి రాశి ఫలాలు. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనాలు కలిగే అవకాశముంది. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
    కాలజ్ఞానం

    అక్టోబరు 30, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారమవుతుంది. తల పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయపడతారు. దగ్గరి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయపరంగా వ్యాపారులకు బాగుంది.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో బాగా శ్రమ ఉన్నా లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

    ధన్‌తేరాస్‌ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. కొత్త కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు శుభవార్తలు చెబుతారు. ఆదనపు ఆదాయం కోసం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

    Dhanteras 2021: కేవలం రూ.5 ఖర్చుతో లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకోండి!

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో అధికారులు బాగా సహకరిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలు పరవాలేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు బాగా విశ్రాంతి అవసరం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత బాగా పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

    Vastu Tips: వంట గదిలో గృహిణి ఎలా ఉండాలి.. ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు ఏ దిశలో ఉండాలి?

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఏలినాటి శని కారణంగా ఆరోగ్యం అప్పుడప్పుడు చికాకు కలిగిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగ జీవితం పరవాలేదు. కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు