Home /News /astrology /

HOROSCOPE TODAY ON DECEMBER 31 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS SK

Horoscope Today: డిసెంబరు 31 రాశి ఫలాలు.. ఈ ఏడాది చివరి రోజు వీరికి అన్నీ శుభాలే

నేటి దిన ఫలాలు

నేటి దిన ఫలాలు

Horoscope Today: నేడు శుక్రవారం. ఈ సంవత్సరం ఆఖరి రోజున పలు రాశుల వారికి అద్భుతంగా ఉంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ కొందరికి మాత్రం అంతగా బాగాలేదు. మరి డిసెంబరు 31న ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

    కాలజ్ఞానం

    డిసెంబరు 31, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1).
    ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.

    వృషభం (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వాగ్వాదాలకు, విభేదాలకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులతో ఇబ్బందులు పడతారు. ఉద్యో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక చిం గడుపుతారు. వ్యాపారులు లాభాలార్జిస్తారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పెళ్లి బరుతుంది.

    Zodiac Signs: ఈ 4 రాశులకు చెందిన యువతులతో జాగ్రత్త.. అసలు కారణం ఇదే

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా పరవాలేదు. వృత్తి నిపుణులు రాణిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.

    సింహం ( Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు మార్గం అనుసరిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

    కొత్త సంవత్సరం శనిదేవుడి అనుగ్రహాం ఈ 3 రాశులపైనే ఉంటుంది.. మీ రాశీ ఉందా?

    కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2)
    ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి. మధ్య మధ్య వైద్య ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. బంధువులు, స్నేహితుల్లో కొందరు ఉత్తి పుణ్యానికి మీకు శత్రువులుగా మారతారు. ఉద్యోగం చికాకు కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి.. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. పెళ్లి సంబంధం విషయంలో ఆశించిన స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

    వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగ జీవితం పరవాలేదు. అధికారుల ప్రశంసలందుకుంటారు. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారాల్సి వస్తుంది. పెళ్లి సంబంధం ఎటూ తేలదు. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారుల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

    మీ పిల్లలు చదువులో సక్సెస్ కావాలంటే.. వారి స్టడీ రూంలో ఈ మార్పులు చేయండి..

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబానికి సం బంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తిప్పట ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అంద రికీ మేలు జరిగే పనులు చేపడతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ధి సాధిస్తారు.

    మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇ. బ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు కొద్దో గొప్పో సహాయం. చేస్తారు. వ్యాపారంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యో గులకు చిరుద్యోగం లభిస్తుంది.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం వారు ఓకే చెబు తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమ యం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆ రోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    ఆంక్షలతో తమ పిల్లలను పాడుచేసే 5 రాశిచక్రాల గుర్తులు ఇవే..

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం జాగ్రత్త, వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎదుగూ బొదుగూ ఉండదు. బంధుమిత్రులు సహాయమందిస్తా రు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లా వాదేవీలకు దూరంగా ఉండాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు