Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పని ఒత్తిడి.. ఆరోగ్యం జాగ్రత్త

Horoscope 09-10-2021: రాశి ఫలాలు

Today Horoscope: నేడు శనివారం ( అక్టోబర్ 09).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 9, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అన్నింటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో మాత్రం కాస్తంత జాగ్రత్త అవసరం. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.

    వృషభం (Taurus): (కృత్తిక 2.3.4, రోహిణి, మృగశిర 1,2)
    ఆర్ధిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా కొన్ని మంచి వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి.

    నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే.. ధనాకర్షణ పెరుగుతుంది!

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఆలోచనలను దగ్గరకి రానివ్వవద్దు.

    సింహం Leo (ముఖ, పుబ్బ, ఉత్తర 1)
    తలచిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటాబయటా శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంది.

    కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

    నవరాత్రుల్లో ఈ 5 దుర్గామాత ఆలయాలని దర్శిస్తే.. అశేష లాభాలు!

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగ, వివాహపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారపరంగా కొద్దిగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్ర ద్ధ అవసరం. నిర్ణయాల వల్ల చాలావరకు మేలు జరుగుతుంది. కుటుంబపరంగా సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది.

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో సమర్ధవంతంగా పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించేవారితో జాగ్రత్తగా ఉ౦డాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    Vastu :ఇంట్లో ఈ వస్తువులు ఉంటే .. ప్రశాంతతకు కొదవుండదు!

    మకరం (capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయంతో ఓ వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దు. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు..

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఆశించినంతగా ఆదాయం పెరిగే అవకాశం ఉ ది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి..
    Published by:Shiva Kumar Addula
    First published: