Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ధనలాభం.. నిలకడగా ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు శుక్రవారం (అక్టోబర్ 08).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాసుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.

 • Share this:
  కాలజ్ఞానం

  అక్టోబరు 8, 2021

  దినఫలాలు

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు, స్వయం ఉపాధి రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్ లాభించ కపోవచ్చు.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.. కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనలాభ సూచనలున్నా యి. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దా రితీస్తుంది.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

  Vastu :ఇంట్లో ఈ వస్తువులు ఉంటే .. ప్రశాంతతకు కొదవుండదు!

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో ప్రమోషన్ కు లేదా ఇంక్రిమెంట్ కు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు కూడా వాయిదా పడతాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగం మారాలనే నిర్ణయానికి వస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వీలైనంతగా దుబారాను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి అన్నివిధాలా బాగుంది.

  Tirumala: తిరుమల హుండీలో ఈ ముడుపు వేస్తే.. మంచి ఫలితం వస్తుంది!

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అనుకోకుండా చికాకులు ఎదురవుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయ త్నాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరపు బంధువులు కలిసే అవకాశం ఉంది. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అన్ని విధాలా అను కూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టుగా ఉంటుంది.

  Zodiac Sign: ఈ రాశుల వారు అబద్ధాలు ఎక్కువగా చెబుతారట.. జాబితాలో మీ రాశి

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో విజయవంతంగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆదాయాన్ని పెంచుకునే దిశలో ఆలోచనలు ప్రారంభిస్తారు.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారుల మీద ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. దగ్గరవారికి ఆర్థికంగా సహాయపడతారు.

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. శుభవార్త ఒకటి ఊరట కలిగిస్తుంది. కుమారుడికి ఇష్టపడినవారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.
  Published by:Shiva Kumar Addula
  First published: