Horoscope today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. అన్నీ శుభాలే..

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు గురువారం .. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాసుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.

 • Share this:
  కాలజ్ఞానం

  అక్టోబరు 7, 2021

  దిన ఫలాలు

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో నిలదొక్కుకుంటారు. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మిత్రుల సలహాలతో ముఖ్యమైన సమస్యలు పరిష్కరించుకుంటారు. తలచిన పనులు నిదానంగా నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆర్థికంగా కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. మంచి నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగ పరంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. ఒక్కొక్కటిగా వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.

  Navaratri 2021: నవరాత్రి రెండోరోజు అమ్మవారి అలంకారం..పూజావిధి!

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా అప్రమత్తంగా ఉండాలి. అనుకోని స మస్యలు ఎదురవుతాయి. దగ్గరవారి సలహాలు తీసుకోండి. ఆర్థికస్థితి బాగుంటుంది. వ్యాపారంలో వి వేకం ఫలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. విందులో పాల్గొంటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్నపనులు సకాలంలో పూర్తవుతా యి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. అధికార యోగం పట్టబోతోంది. భూ, గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆర్థిక లావాదేవీల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మిత్రులతో అపోహలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

  Bathukamma 2021: రంగురంగుల పూల పండగొచ్చే!

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. జీవితంలో పైకి రావడానికి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) వ్యాపారంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్నివిధాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబ బాధ్యతల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి. మన శ్శాంతి లభిస్తుంది.

  Navaratri 2021: నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు వస్త్రం.. ఏ ప్రసాదం అమ్మవారికి

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. పెద్దల సహాయ సహకారాలతో ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. నిదానంగా ముఖ్యమైన సమస్యలు పరిష్కరించుకుంటారు. వినోదాలతో కాలం గడుపుతారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్నిచ్చే కాలం ఇది. కాలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ముఖ్యమైన కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

  గోపూజ చేస్తే.. ఈ పాపాలు పోతాయి!

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక స్థితి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. తోటివారి సహాయ సహకారాలతో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరాలకు సరిపడ డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఆటంకాలను అధిగమించి పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. సలహాలు, సూచనలకు ఇతరులపై ఆధారపడవద్దు. అభివృద్ధికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో శ్రమ అధికమైనా మంచి ఫలితం ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: