Home /News /astrology /

Horoscope Today: ఇవాళ ఈ రాశి వారికి అంతా బాగుంది కానీ కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది

Horoscope Today: ఇవాళ ఈ రాశి వారికి అంతా బాగుంది కానీ కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది

నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

Horoscope Today: నేడు మంగళవారం. దిన ఫలాల ఆధారంగా ఇవాళ ఎవరికి బాగుంది? ఎవరికి అనుకూలంగా లేదు? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
    నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతాన౦ పురోగతి సాధిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.

    వృషభం (Taurus): (కృత్తిక 2.3.4, రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త, అనవసర విషయాల్లో తల దూర్చవద్దు. ప్రస్తుతానికి హామీ ఉండవద్దు.

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్త, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    సింహం Leo (ముఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగంలో అధికారులు, సహెూద్యోగులు సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

    కన్య (kanya): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి, ప్రశంసలు అందుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర ప్రాంతంలో చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.

    వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు దగ్గరవుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల వారు అభివృద్ధి సాధిస్తారు.

    మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఉద్యోగపరంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయం అందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేశకావేశాలకు దూరంగా ఉండాలి. హామీలు ఉండవద్దు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Astrology, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు