HOROSCOPE TODAY ON 6TH NOVEMBER HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU HOW IS YOUR ZODIAC SIGN TODAY KNOW HERE SK
Horoscope today: నవంబరు 6 దిన ఫలాలు.. ఈ రాశి వారికి కష్టాలు.. ఊహించని సమస్యలు
ప్రతీకాత్మక చిత్రం
Today Horoscope: నేడు శనివారం.. ఇవాళ కొన్ని రాశుల వారికి చాలా శుభ సూచికలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. మరికొందరికి మాత్రం బాగా లేదు. మరి నేడు ఏ రాశి వారికి ఎవరికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తల పెట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువు ఒకరికి సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్నపనులు పూర్తవుతాయి. వైద్య సంబంధమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్త వింటారు.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేసే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు లాభాలు ఆర్జిస్తారు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనంకంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలా వరకు మెరుగు పడుతుంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయట పడతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. కొన్ని బాకీలు వసూలువుతాయి. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.