Horoscope 5-8-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంది.. అంతా శుభమే

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: ఇవాళ గురువారం. నేడు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంది. అనుకున్న పనులు జరుగుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. మరికొందరికి మాత్రం బాగాలేదు. రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మరి ఇవాళ ఎవరికి ఎలా ఉందో రాశుల వారీగా తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    05-08-2021

    దినఫలాలు

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు చాలా బాగుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

    వృషభం ( కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) సొంత ఊళ్లోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధివారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి డోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి అడుగేయండి. వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తల పెట్టిన పనులు తేలికగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు పరవాలేదు.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2) అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం  ఖాయమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారులు ఎంతో శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం పరవాలేదు. రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. పెళ్లి ప్రయత్నం వాయిదా పడుతుంది. ఇతరుల తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులకు నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఒక ముఖ్యమైన సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. రుణదాతల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం పెరుగుతుంది కానీ దాంతో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇరుగు పొరుగుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఉద్యోగంలో స్థానచలనానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.
    Published by:Shiva Kumar Addula
    First published: