Horoscope 4-8-2021: రాశి ఫలాలు... ఆదాయం పెరుగుదల

Horoscope 4-8-2021: రాశి ఫలాలు

Horoscope today 4-8-2021: ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వివాహ సంబంధాలు ఏ రాశుల వారికి కుదిరే అవకాశాలు ఉన్నాయి? డబ్బులు ఎవరికి వస్తాయి... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope daily 4-8-2021: దేశంలో ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. అటు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి... ఏ రాశుల వారికి ఆర్థిక అప్రమత్తత అవసరం, ఏ రాశుల వారికి కలిసొస్తుంది.... వంటి విషయాల్ని జ్యోతిష పండితులు... తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి ప్రతి రోజూ ఇస్తున్నారు. మరి 4-8-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం. తద్వారా ఏవైనా అనుకోని ప్రమాదకర సంఘటనలు జరిగేలా ఉంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

  మేష రాశి (Aries)
  అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

  వృషభ రాశి (Taurus)
  ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఆర్థికంగా పుంజుకుంటారు. ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరిఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సన్నిహితులు మీకు అండగా నిలబడతారు.

  మిథున రాశి (Gemini)
  ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

  ఇది కూడా చదవండి: Bhakti: దెయ్యం పట్టడం అంటే ఏంటి? ఎలా వదిలించాలి?

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

  సింహ రాశి (Leo)
  ఉద్యోగం మారదలచుకుంటే గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.

  కన్య రాశి (Virgo)
  ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లిసంబంధం కుదరవచ్చు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడిగలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి.

  తుల రాశి (Libra)
  ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

  ఇది కూడా చదవండి: Video: పీకలదాకా తాగింది.. రోడ్డుపై పడుకుంది.. కర్మరా బాబూ...!

  వృశ్చిక రాశి (Scorpio)
  అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తల పెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒక చిన్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చుకు కళ్లెం వేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చక పోవడం మంచిది.

  మకర రాశి (Capricorn)
  ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పలుకుబడిగల వ్యక్తులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  కుంభ రాశి (Aquarius)
  రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యసనాలు, జూదాల జోలికి వెళ్లవద్దు.

  ఇది కూడా చదవండి: Bhakti: ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండాలి?

  మీన రాశి (Pisces)
  ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.
  Published by:Krishna Kumar N
  First published: