Home /News /astrology /

Horoscope Today: డిసెంబరు 3 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. డబ్బే డబ్బు

Horoscope Today: డిసెంబరు 3 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. డబ్బే డబ్బు

డిసెంబరు 3,  2021 దిన ఫలాలు

డిసెంబరు 3, 2021 దిన ఫలాలు

Horoscope Today: నేడు శుక్రవారం. దిన ఫలాల ఆధారంగా ఇవాళ ఎవరికి బాగుంది? ఎవరికి బాగా లేదు? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.

    కాలజ్ఞానం (Horoscope Today)

    డిసెంబరు 3, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) కలిసొచ్చే కాలం ఇది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఓ వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు లేదు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యాపారులకు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేయండి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. స్నేహితుల మీద ఖర్చు చేస్తారు. పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టే వారుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.

    Zodiac Sign: ఇతరులను చూసి జిలస్ ఫీలయ్యే 4 రాశులు ఏవంటే..

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆగిన పనులు పూర్తవుతాయి. సమయం మీకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలచిన పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పరవాలేదు.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) రోజంతా ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారికి మీ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు . అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. హామీలు ఉండవద్దు.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. వ్యాపారంలో లాభాలున్నాయి. ఆంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. కుటుంబ సహకారంతో ఒక ముఖ్యమైన సమస్య పరి ష్కారమవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

    శనివారం అమావాస్య.. శనిదోషం కలుగకుండా చేయాల్సని పరిహారాలు..

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి డోకా లేదు. కొ త్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. సహచరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయా లు తీసుకోండి.

    వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. వ్యాపార బలం పెరుగుతుంది. బంధువుల్లో మీ పట్ల ఉన్న అపోహలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభవార్త వింటారు. వ్యాపారులకు అన్ని విధాలా సమయం బాగుంది. కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది.

    కలలో మీకు పిల్లలు ఇలా కనబడితే ఏం జరగుతుందో తెలుసా?

    ధనుస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. భాగస్వాములు అండగా నిలబడతారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ధనయోగం కనిపిస్తోంది. కుటుంబ పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మికంగా సమయం గడుపుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ బాధ కొద్దిగా తగ్గుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ధన లాభం ఉంది. శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఖర్చులకు కళ్లెం వేయాలి.

    లక్ష్మీదేవి కరుణకు తులసి వద్ద ఈ ఒక్క ఉపాయం చేయాలి...

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో మంచి విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. దేనికీ అధైర్యపడవద్దు. కుటుంబం విషయంలో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో చక్కటి లాభాలు ఆర్జిస్తారు . ముఖ్యమైన పనిలో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితులతో మీ ఆలోచనల్ని పంచుకోవడం అన్ని విధాలా మంచిది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

    తదుపరి వార్తలు