Today Horoscope: సెప్టెంబరు 30 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఇంటా బయటా ఒత్తిళ్లు

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు గురువారం. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    సెప్టెంబరు 30, 2021

    దిన ఫలాలు

    మేషం ( Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్త లు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో గానీ, స్నేహితులతో గానీ సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

    ఈ ఒక్క పువ్వుతో మహాలక్ష్మిని పూజిస్తే..పట్టిందల్లా బంగారమే!

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు ఆర్థికంగా లాభం పొందుతారు. ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సన్నిహితులు అండగా నిలబడతారు.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా అందుకు దీటుగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

    నవరాత్రి పూజను ఇలా సులభంగా చేసుకోండి!

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

    కన్య ( Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2)
    ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.

    మహిళలు వంటగదిలో ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఆ ఇంటికి ధనమే ధనం!

    తుల ( Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అంది అవసరాలు తీరతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆస్తి విషయంలో సమీప బంధువులు బాగా ఇబ్బంది పెడతారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగంలో సహద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

    పితృశాపం నుంచి విముక్తి పొందాలంటే.. ఒక్కటే మార్గం!

    ధనుస్సు ( Sagittarius) ( మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తల పెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    మకరం ( Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

    భర్తని పేరు పెట్టి పిలిస్తే... ఏమవుతుందో తెలుసా?

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచ యమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు.

    మీనం ( Pisces ) (పూర్వా భాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లవద్దు.
    Published by:Shiva Kumar Addula
    First published: