Home /News /astrology /

HOROSCOPE TODAY ON 28 8 2021 THESE ZODIAC SIGNS MAY GET NEW JOB OFFERS AND BE CAREFUL ON FINANCIAL ISSUES NK

Horoscope 28-8-2021: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగ ఆఫర్లు.. ఆర్థిక అప్రమత్తత

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope today: రాశిఫలాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి 28-8-2021 నాడు ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    Horoscope 28-8-2021: ప్రపంచం పరిస్థితి బాగోలేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ సమస్య, కరోనా సమస్య కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా పోరాడాలి. అదే జీవితం. ఐతే... అలా పోరాడేందుకు రాశిఫలాలు ఒకింత సాయం చేస్తాయి. రాశిఫలాలు మన భవిష్యత్తును ముందే చెబుతాయి. కొన్ని హెచ్చరికలు చేస్తాయి. అప్రమత్తంగా ఉండమంటాయి. అలాంటి హెచ్చరికలతో మనం అలర్ట్ అయ్యి... రాబోయే విపత్తును ఎదుర్కోవచ్చు. ఇందుకు జ్యోతిష పండితులు చెప్పే అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు. మరి తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాంగం వంటి వాటి ఆధారంగా నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. హామీలు ఉండవద్దు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు.

    మిథున రాశి (Gemini)
    ఎంతో శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు, స్వయం ఉపాధివారికి ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలి మనసు గెలుచుకుంటారు.

    కర్కాటక రాశి (Cancer)
    ఉద్యోగంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలు నెత్తికెత్తుకోవద్దు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. వ్యాపారులకు శ్రమ తప్పదు.

    సింహ రాశి (Leo)
    ఉద్యోగంలో అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువులతో పేచీలు తలెత్తుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ఇది కూడా చదవండి: Chinese Kali Temple: కోల్‌కతాలో కాళీ మాత ఆలయం.. అక్కడ నూడుల్సే నైవేద్యం

    కన్య రాశి (Virgo)
    అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. అనవసర ఖర్చులతో బాగా ఇబ్బంది పడతారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    తుల రాశి (Libra)
    ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయంగా పలుకుబడి గల వారితో పరిచయాలు పెరుగుతాయి. పాత స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందగిస్తాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    గతంలో జరిగిన వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చాలాకాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

    మకర రాశి (Capricorn)
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యంలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక, వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ 4 రాశులవారు కష్టజీవులు. విజయాలు సాధిస్తారు

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో ఎవరి సహకారమూ లభించకపోయినా లక్ష్యాలను పూర్తి చేస్తారు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారుల లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు